“ప్రేమమ్(మలయాళం)” సినిమా ద్వారా సాయి పల్లవి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అచ్చమైన మలయాళీగా నటించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. దీంతో అందరూ ఆమెను మలయాళీ అనుకున్నారు. మీడియా వారు కూడా అలాగే పొరబడ్డారు. తన నటనతో అలా మెస్మరైజ్ చేసింది. ఫిదా మూవీలో కూడా అంతేగా.. అచ్చమైన తెలంగాణ అమ్మాయి భానుమతిగా నటించి, సొంతంగా డబ్బింగ్ చెప్పుకొని తెలుగు ప్రేక్షకులతో శెభాష్ అనిపించుకుంది. ఏ భాషలో నటిస్తే అక్కడి అమ్మాయిగా కనిపించడం ఆమె నైజం. అయితే ఆమెకు ఆ విషయం కూడా ఇబ్బంది తెస్తుందని ఇప్పుడే తెలిసింది. రీసెంట్ గా ఈ భామ ఓ సినిమా ప్రచార కార్యక్రమానికి హాజరైంది. అప్పుడు రిపోర్టర్ సాయి పల్లవిని మలయాళీ భామ అని పిలిచారంట.
పాపం ఆమె ఆనందిస్తుందనుకుంటే ఆగ్రహానికి గురైంది. ఎందుకు కోపం వచ్చిందంటే ఆమె మలయాళీ కాదంట. తమిళ అమ్మాయి అట. “నేను మలయాళీ కాదు. పక్కా తమిళ అమ్మాయిని. నేను తమిళనాడులోని కోయింబత్తూరులో పుట్టాను ” అని సాయి పల్లవి స్పష్టం చేయడంతో అక్కడున్నవారందరికీ అర్ధమయింది. ఇప్పుడు మీ అందరికీ తెలిసింది. ప్రస్తుతం సాయిపల్లవి నానికి జోడీగా ‘ఎంసీఏ’ (మిడిల్ క్లాస్ అబ్బాయి) చిత్రంలో నటిస్తోంది. తమిళంలోను తన మార్కు నటనతో ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. విజయ్ దర్శకత్వంలో కరు చిత్రం ద్వారా కోలీవుడ్ లో ఎంటర్ కాబోతోంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకొని త్వరలోనే రిలీజ్ కానుంది.