Sai Pallavi: హ్యాట్రిక్ కొడతానంటున్న సాయి పల్లవి..!

Advertisement

గత 3 ఏళ్లలో సాయి పల్లవి ఎన్నో క్రేజీ సినిమాలను మిస్ చేసుకుంది. ‘డియర్ కామ్రేడ్’ ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అయ్యప్పనుమ్ కోషియమ్'(రీమేక్) ల వంటి ప్రాజెక్టులు ఆమె చేతి వరకు వచ్చినవే..! కానీ ఆమె వాటిని తిరస్కరించింది. ఆ చిత్రాల్లో హీరోయిన్ పాత్రలు నచ్చకపోవడం వల్లే ఈమె మిస్ చేసుకున్నట్టు ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. అంతేకాదు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘కర్ణన్’ రీమేక్ లో కూడా ఈమెకు ఛాన్స్ వచ్చింది.

కానీ ఈమె మిస్ చేసుకున్నట్టు టాక్ నడుస్తుంది. నిజానికి ‘ఫిదా’ ‘ఎం.సి.ఎ’ చిత్రాల తర్వాత సాయి పల్లవి.. తెలుగులో హిట్ అందుకోలేదు. ‘పడి పడి లేచె మనసు’ ‘ఎన్జీకే’ వంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇలాంటి తరుణంలో వచ్చిన ఆఫర్లను కూడా ఈమె రిజెక్ట్ చేస్తూ వచ్చింది. దీంతో ఈమె కెరీర్ డేంజర్ జోన్ లో ఉన్నట్టు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన 2 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా మరొకటి ఫైనల్ స్టేజిలో ఉంది.

నాగ చైతన్య – శేఖర్ కమ్ముల కాంబినేషన్లో చేసిన ‘లవ్ స్టోరీ’, రానాతో చేసిన ‘విరాట పర్వం’ వంటి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరోపక్క నాని తో చేస్తున్న ‘శ్యామ్ సింగ రాయ్’ షూటింగ్ క్లైమాక్స్ కు చేరుకుంది. మరో 4 వారాల షూటింగ్ జరిపితే చిత్రీకరణ పూర్తయినట్టే.! ఈ మూడు కూడా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలే అని తెలుస్తుంది. కచ్చితంగా ఇవి సక్సెస్ అయ్యి తనకు మంచి పేరు తీసుకొస్తాయని సాయి పల్లవి ఆశాభావం వ్యక్తం చేస్తుంది.ఆమె నమ్మకం ఎంత బలమైనదో చూడాలి..!

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus