డబ్బు సంపాదనే తన ధ్యేయం కాదంటున్న సాయి పల్లవి..!

“ప్రేమమ్ (మలయాళం)” సినిమా ద్వారా సాయి పల్లవి  (Sai Pallavi) మంచి గుర్తింపు తెచ్చుకుంది. అచ్చమైన మలయాళీగా నటించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. తెలుగులో ఫిదా మూవీ చేసింది. ఇందులో అచ్చమైన తెలంగాణ అమ్మాయి భానుమతిలా నటించి అందరి మనసులు గెలుచుకుంది. రీసెంట్ గా మిడిల్ క్లాస్ అబ్బాయి లోను నాని కి జోడిగా చలాకీగా నటించి టాప్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇచ్చింది. ఆమె పేరుని యువత జపిస్తున్నారు. ఆమె నటించించిన “క‌ణం” త్వరలో థియేటర్లోకి రానుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ కార్యక్ర‌మాలకు సాయిప‌ల్ల‌వి చాలని చిత్ర బృందం భావిస్తుందంటే ఆమె ఉన్న క్రేజ్ ఏంటో అర్ధమవుతోంది.

సాయిప‌ల్ల‌వి ఈ క్రేజ్‌ సినిమాల్లోనే కాదు బయట కూడా బాగా ఉంది. ఓ బడా సంస్థ అమెరికాలో జ‌రుగ‌బోయే త‌మ
ఈవెంట్‌కు కొన్ని గంట‌ల‌పాటు హాజ‌రుకావాలని సాయి పల్లవిని కోరింది. ఆ కార్య‌క్ర‌మానికి వ‌చ్చినందుకు 20 వేల డాలర్ల(దాదాపు 13 ల‌క్ష‌లు)తోపాటు, అటూ, ఇటూ బిజినెస్ క్లాస్ టిక్కెట్లు, ల‌గ్జ‌రీ హోట‌ల్‌లో ఆతిథ్యం ఏర్పాటు చేస్తామ‌ని ఆఫ‌ర్ చేసింది. ఆ ఆఫ‌ర్‌ను సాయిప‌ల్ల‌వి తిర‌స్క‌రించినట్టు స‌మాచారం. డబ్బు సంపాదన మాత్రమే సాయి పల్లవి ద్యేయం కాదని. అందుకే అటువంటి కార్యక్రమాలకు హాజరుకావడం లేదని ఆమె సన్నిహితులు తెలిపారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus