Sai Pallavi : ప్రఖ్యాత గాయని M.S సుబ్బలక్ష్మి బయోపిక్ లీడ్ రోల్ లో సాయి పల్లవి !

Sai Pallavi : క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన ‘ఫిదా’ చిత్రం ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల హృదయాలలో క్లీన్ ఇమేజ్ తో అభిమానులను సంపాదించుకున్న నటి ‘సాయి పల్లవి’. ఈ అందాల భామ తనదైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంది. చాలా సెలెక్టివ్ గా సినిమాలను ఓకే చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటుంది ఈ భామ. రీసెంట్ గాఒక ప్రతీష్టాత్మక చిత్రం కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ, సాయి పల్లవిని సంప్రదించినట్టు ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది అదేంటంటే … 

M.S subbalaxmi

భారతదేశం గర్వించదగ్గ ప్రఖ్యాత గాయని, లెజెండరీ సింగర్ M.S సుబ్బలక్ష్మి బయోపిక్ లో టైటిల్ రోల్ కోసం హీరోయిన్ సాయి పల్లవిని ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ వారు సంప్రదించినట్టు సమాచారం. దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయట. ఈ మూవీ ని తెలుగు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కించనున్నారట. అయితే గీత ఆర్ట్స్ నిర్మాణ సారథ్యంలో ఈ మూవీ రూపొందబోతుందని సినీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్.

దీనిపై ఆఫిసియల్ గా ఇంత వరకు అయితే క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. అతి త్వరలోనే ఆఫీసియల్ గా ప్రకటన వస్తుందని వినికిడి.  ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సాయి పల్లవి, బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ మూవీలో సీత దేవి పాత్రలో నటిస్తున్నది. ఈ మూవీలో రామునిగా రణబీర్ కపూర్, రావణునిగా యష్ నటిస్తున్నారు.

Chiranjeevi: సోమవారం సినిమా రిలీజ్ ఏంటి?.. మెగాస్టార్ ప్లాన్ మామూలుగా లేదుగా!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus