Sai Pallavi: సాయి పల్లవి ఇంత సింపుల్‌గానా.. అంత ఈజీనా.!

సినిమా హీరోయిన్‌ అయ్యాక.. అందులోనూ స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ వచ్చాక.. అందరి మధ్య సాధారణ అమ్మయిలా తిరగడం అంత ఈజీ కాదు. కానీ ఆ పనిని సులభంగా చేసి చూపించింది సాయిపల్లవి. ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ… సాయిపల్లవి కొన్ని ఇమేజెస్‌ పోస్ట్ చేసింది. అందులో సాయిపల్లవి అందరి మధ్య చక్కగా కలసిపోయింది. సగటు మహిళలాగా వారితో కలసి పని చేస్తూ కనిపించింది. ఇంతకీ ఎక్కడా ఫొటో అనుకుంటున్నారా? పసుపు పొలంలో. అవును పొలంలోనే దిగి సందడి చేసింది.

Click Here To Watch NOW

సాయిపల్లవి పేరుకే హీరోయిన్‌ కానీ, ఎక్కడా ఆ దర్పం చూపించదు అని అంటుంటారు. ఆమెతో పని చేసినవాళ్లు ఇదే మాట చెబుతూ ఉంటారు. తాజాగా ఉగాది విషెష్‌ సోషల్‌ మీడియా పోస్టులో కూడా ఇదే కనిపించింది. పసుపు పొలంలో పని చేస్తున్న మహిళల మధ్యలో సాయిపల్లవి ఉన్నట్లుగా ఓ పోస్ట్‌ చేసింది. అంతమంది మధ్యలో ఎంచక్కా కలసిపోయింది సాయిపల్లవి అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో ఎంత బాగా చెప్పిందో కదా ఉగాది శుభాకాంక్షలు అని ముచ్చటపడిపోతున్నారు.

సాయిపల్లవి రీసెంట్‌ పోస్ట్‌లో మూడు ఫొటోలు ఉన్నాయి. మహిళలతో ఉన్నవి రెండు ఫొటోలు అయితే, ఇంకొకటి అరచేతిలో పచ్చి పసుపు ఉన్న ఫొటో. ఇంత పెద్ద నాయిక అయి ఉండి, మట్టిలో దిగి.. ఇలా ఫొటోలు దిగడం సూపర్‌ కదా. అభిమానులే కాదు, సాటి నాయికలు కూడా ఇదే మాట అంటున్నారు. సాయి పల్లవి ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టుకు అనుపమ పరమేశ్వరన్ హార్ట్‌ సింబల్‌ ఇచ్చింది. నీలా ఎవ్వరూ ఉండలేరు అంటూ శ్రద్ధా శ్రీనాధ్‌ ప్రశంసల వర్షం కురిపించింది.

ఇక సినిమాల సంగతి చూస్తే… ఇటీవల ‘శ్యామ్‌ సింగరాయ్‌’తో అలరించిన సాయి ప్రస్తుతం షూట్‌ నుంచి కాస్త విరామం తీసుకున్నారు. ‘విరాటపర్వం’ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. అయితే ఎప్పుడు అనేది తెలియడం లేదు. ఆ తర్వాత ఆమె ఇంకేం సినిమాలు ఓకే చేయలేదు. అయితే కావాలనే సాయిపల్లవి గ్యాప్ తీసుకున్నారు అని తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus