నా వల్ల షూటింగ్ ఆగిపోలేదు : సాయి పల్లవి

కథల ఎంపికల విషయంలో సాయి పల్లవి చాలా జాగ్రత్తగా ఉంటుంది. పక్కా కమర్షియల్ కథలకు ఓకే చెప్పకుండా.. తనకి గుర్తింపును తీసుకొచ్చే సినిమాలోనే చేస్తూ వస్తోంది. మొదట తమిళంలో ప్రేమమ్ సినిమా ద్వారా అడుగుపెట్టి అక్కడివారు హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగులో మెగా హీరో సరసన ఫిదా మూవీ చేసి తెలుగువారికి దగ్గరయింది. ఎంసీఏ లోను ఆకట్టుకుంది. ఇక కణం సినిమాలోనూ మహిళలు మెచ్చే పాత్రనే చేసింది. అయితే ఆమెను కో స్టార్స్ మెచ్చుకోవడం లేదని గత కొన్ని రోజులుగా గాసిప్ చక్కర్లు కొడుతోంది. గతంలో నాగ శౌర్య తో… రీసెంట్ గా శర్వానంద్‌తో కూడా సాయిపల్లవి గొడవపడిందని వార్త షికారు చేసింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న “పడి పడి లేచే మనసు” సినిమాలో శర్వానంద్ కి జోడీగా సాయి పల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ ఎక్కువభాగం కలకత్తాలో సాగింది. అయితే ఈ షూటింగ్ సమయంలోను శర్వానంద్ తో గొడవపడినట్లు తెలిసింది. అందువల్లే షూటింగ్ ఆగిపోయిందని సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై సాయిపల్లవి స్పందించింది. ఆ వార్తలను ఖండించింది. ”శర్వానంద్ తో నేను గొడవ పడినట్టుగా .. అందువల్లనే షూటింగ్ ఆగిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో ఏమాత్రం నిజం లేదు .. మా మధ్య ఎలాంటి గొడవ జరగలేదు. శర్వానంద్ మరో సినిమా కూడా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగులో పాల్గొంటున్న కారణంగా ఆయన ఈ సినిమాకి బ్రేక్ ఇచ్చాడు .. అంతే” అంటూ సాయి పల్లవి వివరించింది. ఇక నుంచి అయినా నెగటివ్ వార్తలు ఆగుతాయోమో చూద్దాం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus