ఎక్స్‌పోజింగ్‌ చేయకున్నా… అంత ఇస్తున్నారంటే?

ఒక్కోసారి ఒక సినిమా ఇచ్చిన క్రేజ్‌… ఆ తర్వాత కొన్ని సినిమాలు ఫ్లాప్‌ అయినా అలానే ఉంటుంది. అయితే తొలి సినిమా స్టార్‌ ఇమేజ్‌ ఇచ్చి ఉండాలి. దానికి తాజా ఉదాహరణ సాయిపల్లవి. ‘ఫిదా’తో తెలుగు ప్రేక్షకుల గుండెల్ని ఓ రేంజిలో మెలితిప్పింది సాయిపల్లవి. బానుమతి… సింగిల్‌పీస్‌ అంటూ ఏ ముహూర్తాన డైలాగ్‌చెప్పిందెఓ కానీ… కుర్రకారు, నిర్మాతలు ఆమె బుట్టలో పడిపోయారు. దర్శకులు అయితే ఆమె కోసమే కథలు సిద్ధం చేస్తున్నారు. ‘ఫిదా’ తర్వాత చేసిన సినిమాలు ఆ రేంజిలో ఆకట్టుకోలేదు. అయినప్పటికీ ఇప్పటికీ ఆమె జోరు అలానే కొనసాగుతోంది.

‘ఫిదా’ తర్వాత సాయిపల్లవి చేసిన ‘ఎంసీఏ’ ఫర్వాలేదనిపించింది. ఆ తర్వాత వచ్చిన ‘కణం’, ‘పడిపడి లేచే మనసు’, ‘ఎన్జీకే’, ‘మారి 2’ లాంటి సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి. అయితే సినిమాలు ఫ్లాప్ అయినా కూడా అమ్మడు క్రేజ్ మాత్రం అలాగే ఉంది. ఎంతలా అంటే ప్రస్తుతం సాయిపల్లవికి ఒక్కో సినిమాకు కోటిన్నర రూపాయలు ఇచ్చేంత. స్కిన్‌ షో, గ్లామర్ ఒలకబోత విషయంలో నియమాలు పెట్టుకుని నటిస్తున్న సాయిపల్లవి అంత ఎందుకు డిమాండ్‌ చేస్తోందో కూడా అర్థకాక టాలీవుడ్‌ జనాలు తలలు గోక్కుంటున్నారట. హాట్ సీన్స్ చేయననే రూల్‌తో ‘సరిలేరు నీకెవ్వరు’, ‘డియర్ కామ్రేడ్’ లాంటి సినిమాలను సాయి పల్లవి వదిలేసుకుందని టాక్‌.

సాయిపల్లవి నియమాల గురించి చెప్పాలంటే… యాడ్స్‌ విషయంలో ఆమె ఆలోచన కూడా మాట్లాడుకోవాలి. యాడ్స్‌ చేస్తే కోట్లు ఇస్తామని చెప్పినా కూడా అందులో నటించడానికి సాయి పల్లవి నో చెప్పిందట. ఓ ఫేస్ క్రీమ్ సంస్థ ఏకంగా ₹2 కోట్లు ఆఫర్ చేసిందనే వార్తలూ వచ్చాయి. డబ్బు కన్నా.. ఆత్మసంతృప్తి ముఖ్యమని చెబుతుంటుది ఈ బాన్సువాడ భానుమతి. ఎక్కువ సంపాదిస్తే ఏమైనా ఎక్కువ తింటామా… నేనైతే ఎంత సంపాదించినా రాత్రి ఇంటికి వెళ్లి నేను తినేది మూడు చపాతీలే కదా అంటూ నవ్వేస్తుంది.

Most Recommended Video

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus