ఆంధ్రా పొలిటీషియన్ కొడుకుతో సాయి పల్లవి వివాహం?

హీరోయిన్ సాయి పల్లవి పెళ్లి గురించిన వార్తలు తరచుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ టాలెంటెడ్ హీరోయిన్ పెళ్లిపై చాలా మందికి ఆసక్తి ఉంది. ఓ భిన్నమైన వ్యక్తిత్వం, సెల్ఫ్ రెస్పెక్ట్ కలిగిన అమ్మాయి అయిన సాయి పల్లవిని మనువాడే వాడు ఎవడైనా అదృష్ట వంతుడే అనాలి. ఇక ఈ అమ్మడు అఫైర్స్ విషయంలో కూడా క్లీన్ హిస్టరీ కలిగి ఉంది. ఆ మధ్య పెళ్లి వార్తలపై ఈ అమ్మడు స్పందించింది. ఇప్పట్లో పెళ్ళిచేసుకునే ఆలోచన లేదని ఖరాకండీగా చెప్పేసింది.

అంతటితో ఆగకుండా అసలు పెళ్లి చేసుకుంటానో లేదో అని కూడా చెప్పడం విశేషం. సాయి పల్లవి అలా చెప్పినా ఆమె పెళ్లిపై పుకార్లు తగ్గడం లేదు. తాజాగా సాయి పల్లవిని ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోవాలని ఇబ్బంది పెడుతున్నారట. ఒప్పుకున్న సినిమాలు పెళ్లి తరువాత పూర్తి చేసుకో అని సలహా ఇస్తున్నారట. దీనికి సాయి పల్లవి సుముఖత వ్యక్తం చేశారట. అలాగే ఆ వరుడు కూడా ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన ఓ పొలిటీషియన్ కుమారుడు అట.

మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. ఇక ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో రెండు చిత్రాలలో నటిస్తుంది. వాటిలో ఒకటి విరాట పర్వం కాగా ఆమె నక్సలైట్ గా కనిపించనుంది. దీనితో పాటు దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న లవ్ స్టోరీ మూవీలో కూడా నటిస్తుంది. చైతూ కి ఆమె జంటగా నటిస్తుండగా షూటింగ్ చివరి దశకు చేరింది.

Most Recommended Video
\
మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus