టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సాయిపల్లవి చాలా టాలెంటెడ్ నటి అనే సంగతి తెలిసిందే. నేడు ఈ హీరోయిన్ పుట్టినరోజు. నేటితో 29వ వడిలోకి అడుగు పెడుతున్న సాయిపల్లవి తన నటనతో తెలుగుతో పాటు ఇతర భాషల్లో సైతం కోట్ల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని ఊటీకి సమీపంలో ఉన్న కోటగిరి సాయిపల్లవి స్వస్థలం. సాయిపల్లవి, ఆమె చెల్లెలు పూజ కవల పిల్లలు. చిన్నప్పటి నుంచే డ్యాన్స్ అంటే ఆసక్తి ఉన్న సాయిపల్లవికి ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో ధూంధాం అనే తమిళ సినిమాలో ఛాన్స్ వచ్చింది.
తరువాత మీరాజాస్మిన్ సినిమాలో కూడా సాయిపల్లవికి అవకాశం రాగా ఆ తర్వాత ఆమెకు వరుసగా హీరోయిన్ ఆఫర్లు వచ్చాయి. వైద్య విద్య వల్ల కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న సాయిపల్లవి తమిళ దర్శకుడు అల్ఫోన్సో డైరెక్షన్ లో వచ్చిన ప్రేమమ్ మూవీతో హీరోయిన్ గా మారారు. ఆ సినిమా తరువాత తెలుగింటి అమ్మాయిలా ఫిదా సినిమాలో తెలంగాణ యాసలో అద్భుతంగా నటించి సాయిపల్లవి మెప్పించారు.
ఆ సినిమాకు 50 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రావడంతో సాయిపల్లవికి తెలుగులో వరుస ఆఫర్లు వచ్చాయి. ఎంసీఏ సినిమాతో సాయిపల్లవి మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. తమిళంలో సాయిపల్లవి స్టార్ హీరోలకు జోడీగా నటించారు. అయితే తమిళంలో సాయిపల్లవి నటించిన సినిమాలేవీ హిట్ కాలేదు. అయితే ఈ హీరోయిన్ కు లెక్కలంటే చాలా భయమట. ఒక సందర్భంలో మాట్లాడుతూ సాయిపల్లవి తనకు మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే చాలా భయమని వెల్లడించారు.
Most Recommended Video
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!