Sai Tej: సాయితేజ్‌ కొత్త సినిమా.. ఈ సారి తమిళ దర్శకుడు ఫిక్స్‌ అట!

రెండేళ్ల క్రితం ‘విరూపాక్ష’ (Virupaksha), ‘బ్రో’ (BRO)  అంటూ రెండు సినిమాలతో వచ్చిన సాయి తేజ్‌(Sai Dharam Tej) .. ఆ తర్వాత ఏమైందో కానీ ఒక్కసారిగా స్లో అయ్యాడు. ఆ రెండు సినిమాలకు ముందు రెండళ్ల గ్యాప్‌ ఉంది. అయితే అప్పుడు యాక్సిడెంట్‌ కారణంగా కొత్త సినిమాల విషయంలో ఆలస్యమయ్యాడు అనుకోండి. ఆ విషయం వదిలేస్తే ఇప్పుడు ‘సంబరాల ఏటి గట్టు’ (Sambarala Yeti Gattu Carnage)  అంటూ ఓ పాన్‌ ఇండియా సినిమాతోనే చాలా ఏళ్లుగా బండి నడిపిస్తున్నాడు. ఇప్పుడు మరో సినిమా ఓకే అయింది అని టాక్‌.

Sai Tej

‘సంబరాల ఏటి గట్టు’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దసరా కానుకగా సెప్టెంబర్ 25న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. మరో ఆరు నెలలే ఉన్న నేపథ్యంలో కొత్త సినిమాను ఎప్పుడు ఓకే చేస్తాడు అనే ప్రశ్న మొదలైంది. దానికి ఆన్సర్‌ ఓ తమిళ దర్శకుడి ప్రాజెక్టు అని సమాచారం. ఇటీవల ఓ తమిళ యువ దర్శకుడు చెప్పిన కథకు సాయి తేజ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

వినూత్నమైన ప్రేమకథగా సిద్ధం చేసిన స్ర్కిప్టును ఆ దర్శకుడు రెండేళ్ల క్రితం ఓ లైన్‌గా సాయితేజ్‌కు చెప్పారట. ఇప్పుడు ఫైనల్‌ స్క్రిప్ట్‌ రెడీ చేశారట. అంతేకాదు సినిమా ‘ఇది మామూలు ప్రేమ కాదు’ అనే టైటిల్‌ కూడా అనుకుంటున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇప్పుడు అనౌన్స్‌ అయినా సినిమా జులై నెలలో ప్రారంభమవుతుంది అని చెబుతున్నారు.

ఇక సంబరాల ఏటి గట్టు విషయానికొస్తే.. ఈ సినిమాను సుమారు రూ.120 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. రోహిత్‌ కేపీ  (K.P. Rohith)  దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi) కథానాయిక. ‘హను – మాన్‌’  (Hanu Man) సినిమా నిర్మాతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టీమ్‌ ఇటీవల రిలీజ్‌ చేసిన గ్లింప్స్‌ సినిమా మీద అంచనాలను పెంచేసింది. కొత్త రకం కథ రావడం పక్కా అనేలా ఆ వీడియో ఉంది.

విజయ్‌ సినిమాలోనూ ఆ హీరోయినే.. ఆ సినిమాలో ఫిక్స్‌ చేయడానికా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus