అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన భామ!

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో దర్శకుడు సుకుమార్ ‘పుష్ప’ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్.. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఈ వేసవి నుండి వీరి కాంబినేషన్ లో సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కి మంచి ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. దానికోసం బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే సాయి మంజ్రేకర్. సల్మాన్ ఖాన్ నటించిన ‘దబాంగ్ 3’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సాయి మంజ్రేకర్ ప్రస్తుతం తెలుగులో ‘మేజర్’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు వరుణ్ తేజ్ నటిస్తోన్న స్పోర్ట్స్ డ్రామాలో కూడా హీరోయిన్ గా ఈ బ్యూటీనే కనిపించనుంది.

తన లుక్స్ తో దర్శకనిర్మాతల దృష్టిలో పడింది ఈ భామ. ఇప్పుడు అల్లు అర్జున్-కొరటాల శివ సినిమా కోసం కూడా ఈమెనే తీసుకోవాలని అనుకుంటున్నారట. ఈ సినిమాను GA2 పిక్చర్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. 2022 ఆరంభంలో సినిమాను విడుదల చేయాలనేది ప్లాన్.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus