Saif Ali Khan: మహాభారతంలో నటించాలని ఉంది.. మనసులో కోరిక బయటపెట్టిన సైఫ్?

ప్రస్తుతం ప్రతి ఒక్క సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడంతో సౌత్ సెలబ్రిటీలతో కలిసి బాలీవుడ్ సెలబ్రిటీలు నటించడం సర్వసాధారణమైంది. ఈ క్రమంలోనే ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ఆది పురుష్ సినిమాలో రావణాసురడిని పాత్రలో నటిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయగా ఈ టీజర్ ఎన్నో విమర్శలకు కారణమైంది. ఈ టీజర్ లో రావణాసురుడి పాత్ర చూడటానికిచాలా క్రూరంగా ఉందంటూ పెద్ద ఎత్తున రావణాసురుడి పాత్ర పై విమర్శలు వచ్చాయి.

అయితే ఈ విమర్శలపై దర్శకుడు స్పందిస్తూ వివరణ ఇచ్చారు. ఇకపోతే తాజాగా విక్రమ్ వేద సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సైఫ్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా హాలీవుడ్ ఇండస్ట్రీలో లార్డ్స్ ఆఫ్ ది రింగ్స్ తరహాలో మహాభారతం సినిమాని చేస్తే బాగుంటుందని తెలిపారు. మహాభారతం సినిమాలో తనకు నటించాలని ఉందని ఈయన తెలిపారు. మా జనరేషన్ వారికి ఇలాంటి సినిమాలలో నటించడమే డ్రీమ్ అంటూ తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టారు.

ఇలా మహాభారతం వంటి ఓ గొప్ప సినిమాను బాలీవుడ్ దక్షిణాది నటీనటులు కలిసి చేస్తే బాగుంటుంది అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే రామాయణం కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో నటించే అవకాశాన్ని అందుకున్నటువంటి సైఫ్ మహాభారతంలో కూడా నటించాలని ఉందంటూ తన కోరికను బయటపెట్టారు. మరి మహాభారతం నటించాలని ఈయన కోరిక తీరుతుందా.. ఈయనకు మహాభారతంలో అవకాశం కల్పిస్తారా అనే విషయం తెలియాలంటే వేచి చూడాలి.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus