‘ఆదిపురుష్’ కు సంబంధించి కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన సైఫ్..!

ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ చిత్రంలో నటిస్తున్న ప్రభాస్.. మరో 3 ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులను కూడా లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. అవి ఎప్పటికి పూర్తవుతాయో తెలీదు కానీ… వీటిలో ‘ఆది పురుష్’ అనే ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టు కూడా ఉంది. 3డి లో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్టు దర్శకుడు ఓం రౌత్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్నట్టు కూడా సమాచారం. ప్రభాస్ హిందీలో నటించబోతున్న స్ట్రైట్ మూవీ ఇది. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళం,కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతుంది ఈ చిత్రం. టి.సిరీస్ వారు ఈ చిత్రాన్ని రూ.500కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు.

ఇక ఈ చిత్రంలో లంకేష్ అదే రావణుడి పాత్రని సైఫ్ అలీ ఖాన్ పోషించబోతున్నాడు. ఇక సీత మరియు లక్ష్మణుడి పాత్రలో ఎవరు నటించబోతున్నది నిర్మాతలు ఇంకా వెల్లడించలేదు. అయితే.. సైఫ్ పోషిస్తున్న పాత్ర కూడా చాలా కీలకమైనదని తెలిసిందే. అయితే ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ‘ఆది పురుష్’ లో తన పాత్రకు సంబంధించి కొన్ని కీలక విషయాలను లీక్ చేసేసాడు.ఆయన మాట్లాడుతూ.. ‘నిజానికి లంకేష్(రావణ్)‌ పాత్ర నెగెటివ్‌ రోల్‌ అయినప్పటికీ ఈ చిత్రంలో ఆ పాత్రలో ఉన్న పాజిటివ్ కోణాన్ని కూడా దర్శకుడు చూపించబోతున్నాడు.

రామాయణంలో లక్ష్మణుడు..సూర్పణక ముక్కు కోయడం, వంటి విషయాల్లో కూడా లంకేష్‌ మానవతా కోణాన్ని చూపించబోతున్నాడు దర్శకుడు’ అంటూ చెప్పుకొచ్చాడు సైఫ్. తన పాత్ర గురించి అప్పుడే ఇలా లీక్ చెయ్యడం పై ‘ఆది పురుష్’ టీం అసహనంతో ఉన్నారని వినికిడి.’ప్రేక్షకులు సినిమాలో చూసి థ్రిల్ అవ్వాల్సిన ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా ఇలా లీక్ చెయ్యడమంటే.. నార్త్ వాళ్లకు మన సౌత్ వాళ్ళు అంటే ఎంత చిన్న చూపో అర్థంచేసుకోవచ్చు’ అని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus