Saif Ali Khan: నాకు డబ్బు వద్దు..సైఫ్ ను కాపాడిన ఆటో డ్రైవర్ ఏమడిగాడంటే..!

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్‌  (Saif Ali Khan)  జనవరి 15 అర్ధరాత్రి ఇంట్లో దుండగుడి దాడికి గురైన విషయం తెలిసిందే. దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తి కత్తితో సైఫ్‌ పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అప్రమత్తమైన ఇంటి కేర్‌టేకర్ సాయంతో సైఫ్‌ ఆటోలో లీలావతి ఆసుపత్రికి తరలించబడ్డాడు. అక్కడ అత్యవసర శస్త్రచికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం మెరుగుపడింది.ఇక మంగళవారం ఇంటికి తిరిగి వచ్చిన సైఫ్, తనను ఆసుపత్రికి చేర్చడంలో సహాయపడ్డ ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణాను ప్రత్యేకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.

Saif Ali Khan

సైఫ్ కుటుంబం మొత్తం అతనిపై కృతజ్ఞతలు తెలుపుతూ భజన్ సింగ్‌ను హృదయపూర్వకంగా అభినందించింది. అయితే ఈ సంఘటనలో భజన్ సింగ్ రాణా చేసిన సహాయం గురించి పలు కథనాలు బయటకు వచ్చాయి. సైఫ్, భజన్ సింగ్‌కు రూ. 50 వేలు ఇచ్చినట్లు టాక్ వస్తోంది. అలాగే మికా సింగ్ అనే సింగర్ కూడా అతనికి లక్ష రూపాయలు అంధించాలని అనుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.

అయితే భజన్ మాత్రం తనకు డబ్బు మీద ఎలాంటి ఆశ లేదని స్పష్టం చేశాడు. సైఫ్ తన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుని, ‘‘మీకు ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా చెప్పండి’’ అని చెప్పినట్లు భజన్ వెల్లడించారు. అయితే, తాను ఏదీ కోరడం లేదని, తనకు డబ్బు ఇవ్వాలనే అవసరం లేదని అన్నారు. అయితే వారికి నచ్చితే తన జీవనాధారమైన ఒక సొంత ఆటో కొనుగోలు ఇప్పించాలని, అది ఇస్తే ఇస్తే ఎంతో సంతోషిస్తానని సూచించాడు.

ప్రస్తుతం భజన్ సింగ్ అద్దె ఇంట్లో ఉంటూ, అద్దె ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. ఈ ఘటనలో భజన్ నిస్వార్థంగా చేసిన సహాయం ఎంతో మందిని స్పృహింపజేసింది. సైఫ్ కుటుంబం కూడా భజన్ సింగ్‌కు మరింత సాయంగా ఉండాలని భావిస్తోందని టాక్. మరి అతని కోరికపై సైఫ్ ఫ్యామిలీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.

ఆస్కార్‌ నామినేషన్లు వచ్చేశాయ్‌… ఈ సారి ఏయే సినిమాలో బరిలో ఉన్నాయంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus