కెమెరామెన్ల పై మండిపడ్డ ‘ఆదిపురుష్’ నటుడు

  • March 3, 2023 / 07:42 PM IST

స్టార్ హీరోలు, హీరోయిన్లు బయట ఎక్కడైనా కనిపిస్తే.. జనాలు వెంటనే సెల్ ఫోన్లు తీసుకుని రెడీ అయిపోతారు. అలాగే ఏదైనా ఈవెంట్ జరిగితే కెమెరామెన్లు, వీడియోగ్రాఫర్లు కవరేజ్ కోసం వెంటబడుతుంటారు. ఇది సర్వసాధారణమైన విషయం. దాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. కానీ స్టార్ హీరోలు, హీరోయిన్ల ప్రైవేట్ ప్లేసుల్లో కూడా కెమెరాలు పట్టుకుని వెంటాడితే.. అది ముమ్మాటికీ తప్పనే చెప్పాలి. అప్పుడు సెలబ్రిటీలు సైతం విసిగిపోయి ఏదో ఒకటి అనడం మనం చూస్తూనే ఉన్నాం.

మొన్నటికి మొన్న అలియా భట్ ఇంట్లో కొందరు కెమెరాలు పెట్టి ఆమె ప్రైవేట్ లైఫ్ కు భంగం కలిగించారు. ఇప్పుడు మరీ అలాంటిది కాదు కానీ.. దానికి కొంచెం దరిదాపుల్లో ఉన్నటువంటి మేటర్ గురించి చెప్పుకుందాం. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ తన భార్య కరీనా కపూర్ తో కలిసి మలైకా అరోరా తల్లి అయిన జోయ్ సీ 70వ పుట్టినరోజు వేడుకకు వెళ్ళాడు. అక్కడ కెమెరామెన్లు ఈ జంటను ఫోటోలు తీశారు. అక్కడితో అయిపోయింది.

కానీ ఈ దంపతులు ఇంటికి వచ్చినా సరే కెమెరామెన్లు వెంటాడుతూ వచ్చేశారు. దీంతో సైఫ్ కు కోపం వచ్చింది. ‘ఇంకెందుకు మా బెడ్ రూంలోకి కూడా వచ్చేయండి’ అంటూ ఫ్రస్ట్రేషన్ లో వారిని ఓ మాట అన్నాడు. ఇందుకు కరీనా ఓ నవ్వు నవ్వింది.దీంతో కెమెరామెన్లు ‘సైఫ్ సార్ వుయ్ లవ్ యు’ అంటూ కామెంట్ చేశారు. అందుకు సైఫ్ కూడా ‘మాకూ మీరంటే ఇష్టమే’ అని సైలెంట్ గా అనేసి వెళ్ళిపోయాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus