Saitej: ఒక్క మెసేజ్ కే స్పందించిన సాయితేజ్.. మంచి మనస్సంటూ?

మెగా హీరోలలో ఒకరైన సాయితేజ్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉంది. క్లాస్, మాస్, హర్రర్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలతో హిట్లు కొట్టిన సాయితేజ్ ప్రస్తుతం సంపత్ నంది డైరెక్షన్ లో సితార బ్యానర్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు. బడ్జెట్ సమస్యల వల్ల ఈ సినిమా ఆగిపోయిందని ప్రచారం జరిగినా ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ వచ్చింది. తాజాగా సాయితేజ్ చేసిన ఒక పని నెట్టింట వైరల్ అవుతోంది.

సామాజిక కార్యక్రమాలకు సంబంధించి ముందువరసలో ఉండే అతికొద్ది మంది హీరోలలో సాయితేజ్ ఒకరు. తాజాగా సాయితేజ్ ఉదారత చాటుకోగా ఆ విషయం నెట్టింట వైరల్ అవుతోంది. అనాథాశ్రమంలో ఉన్న ఇద్దరు చిన్నారుల చికిత్సకు సాయితేజ్ సహాయం అందించడం గమనార్హం. సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇద్దరు పిల్లల చికిత్స కొరకు సూర్యాపేట జిల్లాలోని చార్లెట్ అనాథ ఆశ్రమం నుంచి ఫోన్ కాల్ రాగా ఆండ్రూ బాబు సాయితేజ్ ను సంప్రదించారు.

సాయితేజ్ కు ఒకే ఒక్క మెసేజ్ పెట్టగా ఆయన వెంటనే సహాయం చేశారని ఆండ్రూ బాబు కామెంట్లు చేశారు. గతేడాది సాయితేజ్ ఏపీ, టీఎస్ పోలీసులు, సైనిక కుటుంబాలకు 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసిన సంగతి తెలిసిందే. సాయితేజ్ ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. తర్వాత సినిమాలతో సాయితేజ్ కెరీర్ బెస్ట్ హిట్లను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

సాయితేజ్ (Saitej) సంపత్ కాంబో మూవీ రిలీజ్ డేట్ గురించి స్పష్టత రావాల్సి ఉంది. సాయితేజ్ త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని భోగట్టా. సాయితేజ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సాయితేజ్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

సుందరం మాస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!

మస్తు షేడ్స్ ఉన్నయ్ రా సినిమా రివ్యూ & రేటింగ్!
సిద్ధార్ధ్ రాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus