అచ్చిరాని ‘పులి’తో రానున్న మెగా హీరో.. ఈసారి ఏమవుతుందో?

ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ వచ్చినా సాయితేజ్‌ యాక్సిండెంట్‌ తర్వాత కాస్త నెమ్మదించారు. సినిమా, సినిమాకు మధ్య గ్యాప్‌ని మెయింటైన్‌ చేస్తున్నాడు. అయితే చేసే సినిమాలు భారీ కాన్వాస్‌లో ఉండేలా చూసుకుంటున్నాడు. ప్రస్తుతం సెట్స్‌ మీద ఉన్న ‘సంబరాల యేటి గట్టు’ సినిమా కూడా భారీ నేపథ్యం, కాన్వాస్‌ ఉన్నదే. ఇప్పుడు ఆ తర్వాత సినిమా విషయంలోనూ ఇదే కాన్సెప్ట్‌ను ఫాలో అవుతున్నాడు సాయితేజ్‌. విజువల్‌ ఎఫెక్ట్స్‌ హెవీ ఉన్న ఓ కథను ఓకే చేశాడని తెలుస్తోంది.

Sai Durga Tej

అయితే, ఈ సినిమా కోసం మెగా ఫ్యామిలీకి అచ్చిరాని ఓ కాన్సెప్ట్‌ను ఓకే చేశాడు అని సమాచారం. ‘సేవ్ ద టైగ‌ర్స్’ అనే వెబ్‌సిరీస్‌తో అంద‌ర్నీ ఆక‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు తేజ కాక‌మాను డైరక్షన్‌లో ఓ సినిమా చేయడానికి సాయితేజ్‌ ఓకే చెప్పాడట. అట‌వీ నేప‌థ్యంలో సాగే ఈ కథను ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, మరో నిర్మాణ సంస్థ కలసి తెరెక్కిస్తాయని చెబుతున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుందని సమాచారం.

ఇక ఈ క‌థ‌లో పులి పాత్ర‌కు ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. పులితో హీరో పోరాటాన్ని వేరే స్థాయిలో డిజైన్ చేశారట. సినిమాకు అవి కీలకంగా ఉంటాయని కూడా చెబుతున్నారు. అయితే అక్కడే ఓ సమస్య వచ్చింది. పులి చుట్టూ తిరిగే కథలు ఏవీ మెగా హీరోలకు పెద్దగా అచ్చి రాలేదు. సినిమా టైటిల్‌లో పులి ఉన్నా కలసి రాలేదు. దీంతో ఇప్పుడు సాయితేజ్‌ ఎలాంటి ఫలితం అందుకుంటాడో అనే ఆసక్తి మొదలైంది.

చిరంజీవి తన కెరీర్‌లో ‘పులి’, ‘పులి బెబ్బులి’ అనే రెండు పులి సినిమాలు చేశారు. తొలి సినిమా ఫ్లాప్‌కాగా, రెండోది ఓ మోస్తారు విజయం అందుకుంది. ఇక పవన్‌ కల్యాణ్‌ సినిమా ‘పులి’ / ‘కొమరం పులి’ అత్యంత ఇబ్బందికర ఫలితాన్ని అందుకుంది. అయితే రామ్‌చరణ్‌కి ‘చిరుత’ విజయం అందించింది. కాబట్టి సాయితేజ్‌ ‘చిరుత’ యాంగిల్‌లో ఆలోచిస్తాడేమో చూడాలి.

 ‘కింగ్ డమ్ 2’ ఆశలు ఆవిరి.. ఆ పొరపాటే కొంప ముంచిందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus