Sajjanar,Bigg Boss: బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ లో అతనికి మద్దతు తెలిపిన టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్!

బిగ్ బాస్ సీజన్ 5 ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతోంది. మొత్తం 19 మంది సభ్యులతో మొదలైన ఈ షోలో సరయు, ప్రియా, ఉమాదేవి, నటరాజ్ మాస్టర్, లహరి, హామిదా, లోబో, విశ్వ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈవారం అనారోగ్య సమస్యలతో జస్వంత్ పడల (జెస్సీ) ఎలిమినేట్ అయినట్లు సమాచారం. ఇక బిగ్ ‏బాస్ ను సాదారణ ఆడియెన్స్ తో పాటు టాప్ సెలబ్రెటీలు కూడా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. కొంతమంది ప్రముఖులు బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కు వారి మద్దతును అందిస్తూ ప్రేక్షకుల నుంచి ఓట్లు వచ్చేలా చేస్తున్నారు.

మెగా బ్రదర్ నాగబాబు ఇదివరకే ట్రాన్స్‏జెండర్ ప్రియాంకకు తన సపోర్ట్ ఇచ్చారు. ఇక హీరో సోనూ సూద్ సింగర్ శ్రీరామచంద్రకు మద్దతు ప్రకటించారు. ఇక రీసెంట్ గా బిగ్‏బాస్ షోపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందిస్తూ.. బిగ్‏బాస్ షో కంటెస్టెంట్ శ్రీరామ్ చంద్రపై పాజిటివ్ కామెంట్స్ చేశారు. మద్దతు ఎవరికనే విషయాన్ని తెలుపుతూ ఒక వీడియోను విడుదల చేశారు. బిగ్‏బాస్ ఇంట్లో శ్రీరామ్ చంద్ర అద్భుతంగా ఆడుతున్నాడని తెలిపిన సజ్జనర్ పాటలు కూడా బాగా పాడుతున్నాడని అన్నారు.

తప్పకుండా అతను బిగ్ బాస్ టైటిల్ గెలుస్తాడనే నమ్మకం ఉందని చెప్పడంతో శ్రీరామచంద్ర ఫాలోవర్స్ సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇప్పటికే అతనికి ప్రేక్షకుల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తోంది. అంతే కాకుండా సోనూసూద్, పాయల్ రాజ్ పుత్ లాంటి వారు కూడా శ్రీరామచంద్ర గెలవాలని కోరుకున్నారు. మరి శ్రీరామ్ అందరూ ఊహించినట్లుగా కప్ గెలుస్తాడో లేదో చూడాలి.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus