Sakshi Dhoni: పవన్ కళ్యాణ్ ప్రభాస్ కి ఇచ్చే డబ్బు నా దగ్గర లేదు!

క్రికెట్ రంగంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఎంఎస్ ధోని ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ వైపు కూడా అడుగులు వేసిన సంగతి మనకు తెలిసిందే క్రికెట్ రంగంలో ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈయన ఇక్కడ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ధోని ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థను ప్రారంభించి లెట్స్ గెట్ మ్యారేజ్ అనే తమిళ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల కానుంది.

ఇక ఈ సినిమా జులై 28వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తమిళంలో పాటు తెలుగులో కూడా ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో హైదరాబాద్లో కూడా చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ధోని భార్య (Sakshi Dhoni) సాక్షి సింగ్ ను ప్రశ్నిస్తూ మీరు పవన్ కళ్యాణ్ ప్రభాస్ వంటి హీరోలతో కూడా సినిమాలు చేయొచ్చు కదా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సాక్షి సమాధానం చెబుతూ ప్రస్తుతం తాను ఇంకా ఇండస్ట్రీలోకి ఇప్పటిప్పుడే అడుగుపెడుతున్నానని తెలిపారు. అంతేకాకుండా ప్రభాస్ పవన్ కళ్యాణ్ వంటి వారు చాలా పెద్ద హీరోలు.. అలాంటి స్టార్స్ కి రెమ్యూనరేషన్ ఇచ్చే అంత డబ్బు నా దగ్గర లేదని ఈమె తెలిపారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగడమే కాకుండా ఒక్కో సినిమాకు 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి ఈమెవారికి ఇచ్చే అంత రెమ్యూనరేషన్ తన వద్ద లేదు అంటూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus