ప్రభాస్ (Prabhas) కెరీర్‌లో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన సలార్ (Salaar) మొదటి భాగం ఎంతగా హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే సినిమా విజయం సాధించినా, బాక్సాఫీస్ వద్ద అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయిందని దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) స్వయంగా చెప్పిన విషయం మరింత చర్చనీయాంశమైంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం, వాస్తవంగా 1000 కోట్ల గ్రాస్‌ను టార్గెట్ చేసుకున్నా, 750 కోట్ల మార్క్ దాటలేకపోయింది. ఇక ఇప్పుడు సలార్ 2 కోసం ఎలాంటి పొరపాట్లు జరగకూడదని ప్రశాంత్ నీల్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.
ముఖ్యంగా, సలార్ స్టోరీ అర్థం కాలేదనే నెగెటివ్ టాక్‌ను పూర్తిగా ఖండించేలా సలార్ 2 స్క్రిప్ట్‌ను మరింత క్లారిటీతో ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీ టాక్. అందుకే, ఈ సీక్వెల్ ద్వారా కేవలం లెక్కలు సమతూకం చేయడం కాదు, బిగ్గెస్ట్ బాక్సాఫీస్ ఫిగర్‌ను అందుకోవాలన్నదే టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది. సలార్ 2 (Salaar 2) టార్గెట్ ఏకంగా 2000 కోట్ల గ్రాస్ అని అంటున్నారు! అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందన్న విషయంపై స్పష్టత రాలేదు.
ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ (The Rajasaab), కాళ భైరవ వంటి సినిమాలతో బిజీగా ఉండగా, ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ (Jr NTR) కోసం ఓ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ గ్యాప్ ఎంతైనా ఉండే అవకాశం ఉందని భావించిన అభిమానులకు తాజాగా మేకర్స్ నుంచి స్పెషల్ అప్‌డేట్ రాబోతోందట. ఇటీవల కొన్ని రూమర్స్ ప్రకారం, మేకర్స్ త్వరలో సలార్ 2 టీజర్ అనౌన్స్‌మెంట్‌ను ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇదే నిజమైతే, ఫ్యాన్స్‌కు ఇది పెద్ద కిక్ ఇవ్వబోతోంది.
సినిమా క్యాన్సిల్ అయినట్లు వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టాలనే ఈ విధమైన అప్డేట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ సినిమా తరువాతే నీల్ ఈ సినిమాను స్టార్ట్ చేసే అవకాశం ఉంది. కానీ ముందుగా ఒక అప్డేట్ ఇస్తే క్లారిటీ ఉంటుందని అనుకుంటున్నారట. ఇక సలార్ మొదటి భాగం స్టోరీ క్లారిటీ విషయంలో వచ్చిన మిక్సడ్ రెస్పాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని, సలార్ 2 విషయంలో ఎటువంటి సందేహాలకు తావు లేకుండా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డబుల్ ప్లాన్‌తో మాస్ ఎంటర్‌టైనర్ అందించబోతున్నట్లు సమాచారం.
ఈ చిత్రం కోసం హోంబలే ఫిల్మ్స్ మరింత భారీ బడ్జెట్‌ను ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతోంది. విజువల్ గ్రాండియర్, యాక్షన్ సీక్వెన్స్‌ల పరంగా ఇది ప్రశాంత్ నీల్ కెరీర్‌లోనే అత్యంత అద్భుతమైన చిత్రంగా నిలుస్తుందని అంటున్నారు. మరి త్వరలో రాబోయే ఈ స్పెషల్ అప్‌డేట్ ఎలాంటి అంచనాలను అందుకుంటుందో వేచి చూడాలి.