Sreeleela: బోల్డ్ సీన్స్ కు శ్రీలీల సిద్ధమేనా?

Ad not loaded.

ఇప్పటి వరకు శ్రీలీల  (Sreeleela)  తెలుగులో చేసిన సినిమాలు చూసినవారెవరైనా ఆమెను పూర్తిగా ఫ్యామిలీ, మాస్ ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యే హీరోయిన్‌గానే చూశారు. గ్లామర్ షో చేస్తూ కెరియర్‌ను మెయింటెయిన్ చేస్తున్నప్పటికీ, రొమాంటిక్ ఇంటిమేట్ సీన్స్ చేయని హీరోయిన్‌ల జాబితాలో ఆమె ఉంది. కానీ ఇప్పుడు ఆమెకు బాలీవుడ్‌లో ఊహించని ఛాలెంజ్ ఎదురైనట్టుగా అనిపిస్తోంది. శ్రీలీల తాజాగా బాలీవుడ్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆశీకీ 3 సినిమాతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లిన మరొక తెలుగు హీరోయిన్‌గా రికార్డు సృష్టించబోతోంది.

Sreeleela

ఈ చిత్రంలో ఆమెకు హీరో కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan)  జోడీగా నటించనుండగా, అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నాడు. ఆశీకీ ప్రాంచైజీ అంటేనే మ్యూజికల్ లవ్ స్టోరీల సిరీస్, అందులోనూ భావోద్వేగాలకు తోడు రొమాన్స్‌కి పెద్ద పీట వేసే కథాంశాలు ఉంటాయి. ఇప్పటికే బాలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో లిప్ లాక్ సీన్స్, ఇంటిమేట్ ఎమోషన్స్ ఎక్కువగా ఉండబోతున్నాయనే టాక్ నడుస్తోంది.

గతంలో ఆశీకీ సిరీస్ సినిమాల్లో రొమాన్స్‌కు ప్రాధాన్యం ఎక్కువగా ఉండటమే కాకుండా, ట్రెండింగ్‌కి తగ్గట్టుగా డీప్ లవ్ సీన్స్ కూడా ఉండేవి. ఈ నేపథ్యంలో శ్రీలీలకు ఇప్పుడు అసలు టెస్ట్ స్టార్ట్ అయ్యిందనే అనిపిస్తోంది. తెలుగులో ఇప్పటివరకు రొమాంటిక్ పాత్రలు చేసినా, లిప్ లాక్ లాంటి బోల్డ్ సీన్స్ చేయలేదు. కానీ, బాలీవుడ్ ప్రమాణాలకు తగ్గట్టుగా నటించాలంటే ఈ తరహా సీన్స్‌లో నటించడం తప్పనిసరి అవుతుంది.

ఇప్పటికే పుష్ప 2 (Pushpa 2: The Rule) లో కిసిక్ పాటతో తన గ్లామర్ లెవెల్ పెంచిన శ్రీలీల, ఆశీకీ 3 కోసం మరింత బోల్డ్ అవుతుందా అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు చేసిన సినిమాల్లో శ్రీలీల యూత్‌ను ఆకట్టుకునేలా నటించినప్పటికీ, బాలీవుడ్ ఆడియెన్స్‌కి ఈ కొత్త యాంగిల్ ఎంతవరకు నచ్చుతుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus