Salaar, Devara Vinayaka Idols: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వినాయకుని విగ్రహాలు.. ఏమైందంటే?

హిందువులకు అతి ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ఒకటి కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి పండుగ అంగరంగ వైభవంగా జరుగుతోంది. అయితే కొంతమంది అభిమానులు హీరోలపై అభిమానంతో హీరోల పాత్రలతో గణేషుడి విగ్రహాలను తయారు చేయించడం ద్వారా వార్తల్లో నిలిచారు. అనంతపూర్ లో సలార్ (Salaar) గణేషుడు అనకాపల్లిలో దేవర (Devara) గణేషుడికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సలార్, దేవర పాత్రల వినాయకుని విగ్రహాలు చూసి కొంతమంది పాజిటివ్ గా కామెంట్ చేస్తుంటే మరి కొందరు నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

Salaar, Devara Vinayaka Idols

హీరోల పాత్రలతో విగ్రహాలను తయారు చేయడం ఏంటని కామెంట్లు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం పుష్ప2 (Pushpa 2) సినిమా పాత్రలతో ఉన్న వినాయకుని విగ్రహం వైరల్ కాగా ఆ విగ్రహం విషయంలో ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. సలార్ మూవీ గతేడాది థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా దేవర (Devara) మూవీ త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. దేవర సినిమా విడుదలకు మాత్రం మరో మూడు వారాల సమయం ఉంది. దేవర ట్రైలర్ కు వచ్చే రెస్పాన్స్ ఆధారంగా ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉండనుందో స్పష్టత రానుంది.

దేవర (Devara) ట్రైలర్ ఈ నెల 10వ తేదీన విడుదల కానుంది. దేవర సినిమా పాన్ ఇండియా మూవీ కావడం, తారక్ సోలో హీరోగా అరవింద సమేత (Aravinda Sametha Veera Raghava) తర్వాత నటించిన సినిమా కావడం ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమని చెప్పవచ్చు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)సైతం ఈ సినిమా రిజల్ట్ విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ సినిమా నుంచి ఆయుధ పూజ సాంగ్ రిలీజ్ కావాల్సి ఉండగా ఆ సాంగ్ రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది.

ప్రభాస్ మూవీ ఆడియో రైట్స్ వార్తల్లో అసలు నిజాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus