Salaar OTT: సలార్ మూవీ ఓటీటీ డేట్ ఇదే.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద 700 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రముఖ థియేటర్లలో సలార్ మూవీ ప్రదర్శితమవుతోంది. సలార్ మూవీ డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ నెల 20వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

విడుదలైన నాలుగు వారాలకే నెట్ ఫ్లిక్స్ వేదికగా సలార్ స్ట్రీమింగ్ కావడం గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తం ఖర్చు చేసి ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకోవడంతో విడుదలైన నాలుగు వారాలకే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. థియేటర్లలో సలార్ మూవీని చూసిన వాళ్లు సైతం ఓటీటీలో ఈ సినిమాను చూడటానికి ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం.

సలార్ (Salaar) మూవీ తక్కువ రోజుల్లోనే స్ట్రీమింగ్ కానుండటంతో ఇప్పటివరకు ఈ సినిమాను చూడని ప్రేక్షకులు సైతం సంతోషిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ లో సలార్ మూవీకి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ రావడం గ్యారంటీ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఖాన్సార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సలార్ మూవీ ప్రభాస్ అభిమానులకు ఎంతగానో నచ్చేసింది. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ కు సైతం మంచి మార్కులు పడ్డాయి.

ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే సలార్ మూవీ భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోగా ప్రమోషన్స్ చేసి ఉంటే ఈ సినిమా సులువుగా 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించి ఉండేది. సలార్2 సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ భవిష్యత్తు సినిమాలు సైతం భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus