Salaar: సలార్ క్రియేట్ చేస్తున్న రికార్డులు మామూలుగా లేవుగా.. అసలేం జరిగిందంటే?

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ సలార్ పై భారీ స్థాయిలో అంచనాలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇంకా రిలీజ్ కాకపోయినా ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా రిలీజ్ కానుండగా ఆకాశమే హద్దుగా ఈ సినిమాకు బుకింగ్స్ జరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. విదేశాల్లో ఇప్పటివరకు 5 లక్షల సలార్ టికెట్లు అమ్ముడయ్యాయని అక్కడి డిస్ట్రిబ్యూషన్ సంస్థ అధికారికంగా ప్రకటించడం గమనార్హం.

ఓవర్సీస్ లో ఈ సినిమా కలెక్షన్లు న భూతో న భవిష్యత్ అనేలా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. సలార్1 పై ఈ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయంటే సలార్2 సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఏర్పడతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సలార్ సినిమా ఎప్పుడు విడుదలైనా సరికొత్త రికార్డులు క్రియేట్ కావడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ కు మరో నాలుగు వారాల సమయం ఉంది.

మరో రెండు వారాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కానున్నాయి. సలార్2 సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి త్వరలో మరింత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రభాస్ త్వరలో ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొననున్నారని సమాచారం. ప్రభాస్ పారితోషికం 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉండగా ప్రభాస్ డిమాండ్ చేస్తే మరింత ఎక్కువ మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.

సలార్ (Salaar) సినిమా విడుదలైన తర్వాత ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో శృతి హాసన్ కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొననున్నారని తెలుస్తోంది.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus