ప్యాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ , క్రేజీ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కలిసి సలార్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోదావరిఖనిలో స్పీడ్ గా జరుగుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ తాకిటి ఎక్కువగా ఉన్నా కూడా షూటింగ్ కి ఎలాంటి ఆటంకం కలగకుండా స్పీడ్ గా సీన్స్ ని తీస్తున్నాడట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అయితే, సోషల్ మీడీయాలో ఇది ఆల్రెడీ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఉగ్రమ్ సినిమానే అనే టాక్ వినిపిస్తోంది.
ఇందులో ఎంతవరకూ నిజం ఉంది అనేది డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చెప్పాల్సిందే. ఈ విషయం పక్కనబెడితే, ఈ సినిమాని చాలా స్పీడ్ గా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తోందట మూవీటీమ్. సలార్ సినిమాలో యాక్ట్ చేస్తున్న వాళ్లందరినీ ముందుగానే డేట్స్ ఎడ్జెస్ట్ చేయమని చెప్పడమే దీనికి కారణం అని అంటున్నారు. ఇక నాలుగు నెలల్లోనే షూటింగ్ ని కంప్లీట్ చేసేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఫస్ట్ టైమ్ శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. రాధేశ్యామ్ తర్వాత ప్రభాస్ చేస్తున్న యాక్షన్ సినిమా కావడంతో ఈ సినిమాకి ఇండియా లెవల్లో బజ్ క్రియేట్ అయ్యింది.
అంతేకాదు, కేజీఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ కాకముందే ఈసినిమాని ప్రశాంత్ నీల్ తెరక్కిస్తుండటం అనేది అందరిలోనూ ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. మరి నాలుగు నెలల్లో ఈ సినిమాని కంప్లీట్ చేస్తే ఈసంవత్సరమే రిలీజ్ చేస్తారా.. లేదా వచ్చే సంక్రాంతికి ఈ సినిమాని మార్కెట్ చేసుకుంటారా అనేది చూడాలి. ఒకవేళ ఈ సంవత్సరం సినిమా కంప్లీట్ అయిపోతే అందరికంటే ముందే ప్రభాస్ థియేటర్స్ లో సందడి చేస్తాడు. కేజీఎఫ్ ప్రొడ్యూసర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఎక్కువ భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి అదీ విషయం.
Most Recommended Video
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?