Salaar: సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న సలార్ టీజర్.. ట్రైలర్ ఎప్పుడంటే?

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ మూవీ నుంచి తాజాగా టీజర్ విడుదలైందనే సంగతి తెలిసిందే. అన్ని భాషలకు సంబంధించి ఒకే టీజర్ రిలీజ్ కాగా ఈ టీజర్ కు ఏకంగా 100 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఒక విధంగా ఇది సంచలనం అనే చెప్పాలి. మరోవైపు సలార్ ట్రైలర్ ను ఆగష్టు నెలలో విడుదల చేస్తామని మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడటం గమనార్హం. సలార్ టీజర్ గురించి కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నా మెజారిటీ ప్రేక్షకులకు మాత్రం ఈ టీజర్ ఎంతగానో నచ్చేసింది.

మరోవైపు శృతిహాసన్ ను టీజర్ లో అస్సలు చూపించకపోవడంతో శృతి హాసన్ అభిమానులు ఫీలవుతున్నారు. రాబోయే రోజుల్లో సలార్ మూవీ కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సలార్ సినిమా టీజర్ ప్రభాస్ అభిమానులకు నచ్చేసింది. కేజీఎఫ్2 సినిమాకు సలార్ కు లింక్ ఉందని కామెంట్లు వినిపిస్తుండగా సలార్ ట్రైలర్ లో ప్రేక్షకులు కోరుకున్న అంశాలు అన్నీ ఉన్నాయని తెలుస్తోంది.

సలార్ (Salaar) పార్ట్2 షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకనుందని తెలుస్తోంది. సలార్ సినిమా నిడివి కూడా ఎక్కువగానే ఉండనుందని సమాచారం. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సలార్ మూవీ ఎప్పుడు విడుదలైనా సంచలనాలు సృష్టించడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. గత సినిమాలతో నిరాశపరిచిన ప్రభాస్ తర్వాత సినిమాలతో మాత్రం అంచనాలను అందుకుంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ప్రభాస్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. సలార్ మూవీలో యాక్షన్ సీన్లు సరికొత్తగా ఉంటాయని తెలుస్తోంది. ప్రభాస్ సినిమాల నుంచి అభిమానులు ఏం కోరుకుంటారో ఆ అంశాలన్నీ ఈ సినిమాలో ఉండనున్నాయని సమాచారం అందుతోంది.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus