Salaar: సలార్1 స్క్రిప్ట్ అలా ఉండనుందా.. నెక్స్ట్ లెవెల్ అనిపించేలా?

సలార్ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కనుందని క్లారిటీ రావడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. అయితే టీజర్ లో ప్రభాస్ కు సంబంధించిన షాట్స్ కొంతమేర ఎక్కువగా ఉండి ఉంటే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సలార్ మూవీ స్టోరీ ఇదేనంటూ ఒక స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఆ స్టోరీ సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. లైమ్ స్టోన్ మైనింగ్ ఫార్మా మాఫియా కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని ఈ మూవీలో యూఎస్ ఆర్మీకి సంబంధించిన సన్నివేశాలు కూడా ఎక్కువగానే ఉంటాయని సమాచారం అందుతోంది.

యూఎస్ ఆర్మీ ప్రభాస్ మధ్య యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని ఆ సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమార్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తారని భోగట్టా. కేజీఎఫ్ ఛాప్టర్2కు ఈ సినిమాకు లింక్ ఉంటుందని 1995 బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. స్క్రీన్ పై ప్రభాస్ కనిపించే సన్నివేశాలు ప్రేక్షకులతో విజిల్స్ వేయించేలా ఉంటాయని సినిమాలో గూస్ బంప్స్ వచ్చే సన్నివేశాలకు కొదువ ఉండదని తెలుస్తోంది.

కేజీఎఫ్ ఛాప్టర్2 ను మించి ఈ సినిమా (Salaar) సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. సలార్ సలార్2 సినిమాలు సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. సలార్2 కూడా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సలార్ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ నెల 28వ తేదీన థియేటర్లలో విడుదల కానుండటం హాట్ టాపిక్ అవుతోంది.

ప్రభాస్ ప్రాజెక్ట్ ల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సలార్ సినిమాలో గ్రాఫిక్స్ కు పెద్దగా ప్రాధాన్యత ఉండనుందని సమాచారం అందుతోంది. త్వరలో ప్రభాస్ సలార్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొననున్నారు.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus