Prabhas: ‘సలార్‌’లో యాక్షన్‌ ఫ్యాన్స్‌కి ఫుల్‌ ఫీస్ట్‌ అంటున్నారు!

ప్రభాస్‌ నుండి ఫ్యాన్స్‌ కోరుకునే అంశాల్లో యాక్షన్‌ సీన్స్‌ ముఖ్యమైనవి అని చెప్పొచ్చు. ఆ ఆరడగుల కటౌట్‌ అలా విలన్లను గాల్లోకి ఎగరేసి కొడుతుంటే విజిల్స్‌ వేసీ వేసీ అలుపొచ్చేస్తుంటుంది ఫ్యాన్స్‌కి. కేకలతో గొతులు బొంగురుపోతుంటాయి ప్రేక్షకులకు. అలాంటి ప్రభాస్‌ – ప్రశాంత్‌ నీల్‌ కలుస్తున్నారు అనేసరికి యాక్షన్‌ హంగామా మామూలుగా ఉండదు అని ఫిక్స్‌ అయిపోయారు ఫ్యాన్స్‌. అందుకు తగ్గట్టే లీక్‌ అయిన లుక్‌లు, బిట్‌ సీన్స్‌ కూడా అదిరిపోయాయి అని చెప్పొచ్చు.

ఇప్పుడు మరో న్యూస్‌ వైరల్‌ అవుతోంది. అదే ఈ సినిమాలోని ఫైట్స్‌ గురిచి. ‘సలార్‌’ సినిమాలో ప్రశాంత్‌ నీల్‌ మొత్తం ఎనిమిది ఫైట్స్‌ ప్లాన్‌ చేశారట. అందులో సగం ఫైట్స్‌ షూటింగ్‌ అయిపోగా, ఇంకా సగం త్వరలోనే పూర్తి చేస్తారని చెబుతున్నారు. కొత్త షెడ్యూల్‌లో వాటి పని పడతారని తెలుస్తోంది. అయితే ఇక్కడ ఒకటే డౌట్‌. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తారని ఆ మధ్య వార్తలొచ్చాయి. దీంతో మొత్తం రెండు భాగాల్లో ఈ ఎనిమిది ఫైట్సా..

లేక ఒక భాగంలోనే ఆ ఫైట్స్‌ అన్నీ ఉంటాయా అనేది తెలియడం లేదు. ప్రశాంత్‌ నీల్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఎలా ఉంటాయో ఇప్పటికే మనం ‘కేజీయఫ్‌’ రెండు భాగాల్లో చూశాం. యశ్‌ను ఎంత స్టైలిష్‌గా చూపించాడో అందరికీ తెలిసిందే. అలాంటి పూర్తి మాస్‌ ఇమేజ్‌ ఉన్న ప్రభాస్‌ కోసం ఇంకెన్ని ఎలివేషన్‌ సీన్స్‌, షాట్లు ప్రశాంత్‌ నీల్‌ తన అమ్ములపొది నుండి బయటకు తీశారు అనేది చూడాలి. ప్రభాస్‌ ఇటీవల కాలంలో కొన్ని యాక్షన్‌ సీన్స్‌లో నటించినా అవి అంత మాసీగా ఉండవు.

ఇప్పుడు ‘సలార్‌’లో పక్కాగా అలాంటి ప్రభాస్‌ను చూడొచ్చు అంటున్నారు. ఈ సినిమా గురించి ఇలాంటి వార్తలు చాలా వస్తున్నా, రిలీజ్‌ విషయంలో మాత్రం ఎలాంటి పుకార్లు రావడం లేదు. మొన్నీ మధ్య ‘కేజీయఫ్‌ 2’తో ‘సలార్‌’ గ్లింప్స్‌ వస్తుందని చెప్పినా రాలేదు. దీంతో ‘సలార్‌’ దర్శనం కోసం ఫ్యాన్స్‌ వెయిటింగ్‌. అన్నట్లు ‘సలార్‌’, రాకీ భాయ్‌ సినిమాలో ఓ సీన్‌లో కనిపిస్తారు అని చెబుతున్నారు. మీకు తెలిసే ఉంటుంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus