Salaar2: సలార్2 చిక్కుముడులివే.. అన్ని ప్రశ్నలకు జవాబు దొరుకుతుందా?

సలార్1 మూవీ అంచనాలకు మించి విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నో ప్రత్యేకతలతో ఈ సినిమా తెరకెక్కగా ఓటీటీలలో సైతం సలార్ సంచలనాలు కొనసాగుతున్నాయి. సలార్1 మూవీ చూసిన వాళ్లకు ఎన్నో ప్రశ్నలు మిగిలిపోయాయి. సలార్2 సినిమాలో ఆ ప్రశ్నలకు సమాధానాలు దొరకాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సలార్2 మూవీలో ఖాన్సార్ లో ఉన్న వ్యక్తులు కృష్ణకాంత్, అతని కూతురు ఆద్య కోసం ఎందుకు వెతుకుతున్నారు? రాజమన్నార్ కు సన్నిహితుడైన కృష్ణకాంత్ చేసిన తప్పేంటి? ఆద్య తల్లి ఎవరు? కృష్ణకాంత్ చేసిన తప్పేంటి అనే ప్రశ్నకు జవాబు దొరకాల్సి ఉంది.

కృష్ణకాంత్ కు బిలాల్ చేసిన వాగ్దానం ఏంటనే ప్రశ్నకు సైతం ఈ సినిమాలో సమాధానం దొరకాల్సి ఉంది. రాధారమ చీకట్లో వణుకుతూ ఉండటానికి కారణాలేమిటి? భర్త గురించి నిజం తెలిసిన తర్వాత ఆమె ఏం చేయబోతుందనే ప్రశ్నకు సలార్2 సినిమాతో జవాబు దొరుకుతుంది. శౌర్యాంగ నాయకుడు ధార నిజంగా చనిపోయాడా? లేక బ్రతికి ఉన్నట్టు చూపించి సలార్2 (Salaar2) మూవీలో ట్విస్ట్ ఇస్తారా? అనే ప్రచారం సైతం జరుగుతోంది.

ధారా పాత్రలో ప్రభాస్ కనిపిస్తారో లేదో తెలియాల్సి ఉంది. ఖాన్సార్ కు వెళ్లిన దేవా తిరిగి రావడానికి, దేవా తల్లి భయపడటానికి కారణాలేంటి? అనే ప్రశ్నలతో పాటు ఆద్యను కాపాడటానికి దేవా మెషీన్ గన్స్, లాంఛర్లను ఎలా తీసుకొచ్చాడనే ప్రశ్నలకు జవాబు దొరకాల్సి ఉంది.

దేవా వరద రాజమన్నార్ కు వ్యతిరేకంగా ఉన్నవాళ్ల విషయంలో ఏం చేశాడు? దేవ్ సీన్ ను క్రియేట్ చేయడానికి ఆ సీల్ వెనుక ఉన్న నిబంధనలకు కారణాలేంటి? పండిట్ ఎవరు? వరద కలను దేవా ఎలా సాకారం చేశాడు? వాలి ఆయుధాల డీల్ చేయడానికి కారణాలేంటి? దేవా, వరద శత్రువులుగా మారడానికి కారణాలేంటి? ఈ పశ్నలు సైతం సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus