Venkatesh: ‘ఎక్స్‌’ కోసం వెంకటేశ్‌ ఫ్రెండ్‌ కూడా.. ఆయన నటించడం పక్కానా?

‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ వెంకటేశ్‌ (Venkatesh)  – అనిల్‌ రావిపూడి (Anil Ravipudi)   రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఓ షెడ్యూల్‌ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను త్వరలో ప్రారంభించబోతున్నారు. ఈ క్రమంలో సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. అదే ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఒకరు నటిస్తున్నారని. ఆయనే సల్మాన్‌ ఖాన్‌ అని చెబుతున్నారు. ఎక్స్‌ పోలీసు, ఎక్స్‌ గర్ల్‌ఫ్రెండ్‌, ఎక్స్‌లెంట్ వైఫ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమా ఎక్స్‌ట్రార్డినరీ ఫ్రెండ్‌గా సల్మాన్‌ ఖాన్‌ నటిస్తాడు అని చెబుతున్నారు.

Venkatesh

ఈ మేరకు త్వరలో ముంబయిలో ఓ షెడ్యూల్‌ ప్లాన్‌ చేస్తున్నారట. అక్కడే కీలక సన్నివేశాలు కొన్ని తెరకెక్కిస్తారు అని చెబుతున్నారు. లేదంటే హైదరాబాద్‌లోనే ప్రత్యేకంగా సెట్‌ వేసి చిత్రీకరణ జరుపుతారు అని అంటున్నారు. సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) నటించిన ‘కిసీ కా భాయి కిసీ కీ జాన్‌’ (Kisi Ka Bhai Kisi Ki Jaan) సినిమాలో వెంకటేశ్‌ (Venkatesh) కీలక పాత్రలో నటించి మెప్పించారు. అయితే సినిమా సరైన విజయం అందుకోలేకపోయింది. ఆ సినిమాలో నటించినందుకు థ్యాంక్యూ చెప్పడానికే సల్మాన్‌ ఖాన్‌ తిరిగి నటిస్తున్నారు అని చెప్పొచ్చు.

మరి సల్మాన్‌ ఎలాంటి పాత్రలో నటిస్తాడు, ఎలా అలరిస్తాడు అనేది చూడాలి. ఇక సినిమా టీమ్‌ రీసెంట్‌గా పొల్లాచ్చిలో తొలి షెడ్యూల్ ముగిసింది. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలతోపాటు వెంకటేష్ (Venkatesh) – ఐశ్వర్య రాజేష్‌పై (Aishwarya Rajesh) ఓ పాటను కూడా చిత్రీకరించారట. ఈ క్రమంలో సినిమా సగం చిత్రీకరణ పూర్తయింది అని ఇటీవల అనిల్‌ రావిపూడి తెలిపారు. సినిమాను సంక్రాంతికి రిలీజ్‌ చేసే ఆలోచనలో ఉండటంతో అనిల్‌ రావిపూడి జెట్‌స్పీడ్‌లో షూటింగ్‌ చేస్తున్నారు.

సంక్రాంతికి ఇప్పటికే చిరంజీవి (Chiranjeevi) ‘విశ్వంభర’ (Vishwambhara) , అజిత్‌ ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ సినిమాలు రెడీ అవుతున్నాయి. మిగిలిన సినిమాలు కొన్ని ఆ సీజన్‌ కోసం రెడీ అవుతున్నా.. ఎంతవరకు అప్పటికి పూర్తవుతాయి అనేది చెప్పలేం. ఈ లెక్కన సంక్రాంతికి ముగ్గురు పెద్ద హీరోల సినిమాలు వస్తాయి అని చెప్పొచ్చు. ఇంకో చిన్న సినిమా కూడా వస్తుంది అని టాక్‌.

సందీప్ రెడ్డి వంగా- ఎన్టీఆర్.. ఊహించని కాంబో సెట్ అవుతుందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus