బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. 50 ఏళ్ళు దాటినా ఇంకా పెళ్ళి చేసుకోలేదు. గతంలో కొంతమంది హీరోయిన్లతో సల్మాన్ డేటింగ్ లో ఉన్నాడంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వాళ్ళలో ఎవరో ఒకరితో సల్మాన్ పెళ్ళి చేసుకుంటాడని వార్తలు వచ్చినా.. అవి రూమర్లు గానే మిగిలిపోయాయి . ఇక ఈమధ్య కాలంలో కూడా .. ఓ విదేశీ అమ్మాయితో సల్మాన్ డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. పెళ్ళి కూడా ఫిక్స్ అన్నారు. కానీ అదేమీ జరగలేదు. అయితే సల్మాన్ పెళ్ళి ఎప్పుడో జరగాల్సిందట. ఈ విషయాన్ని సల్మాన్ కి అత్యంత సన్నిహితుడైన సాజిద్ నడియాడ్ వాలా చెప్పుకొచ్చాడు.
సాజిద్ మాట్లాడుతూ.. “1999లో ఒక అమ్మాయితో సల్మాన్ పెళ్ళి ఫిక్స్ అయిందట. అదే సమయంలో నా పెళ్ళి కూడా కుదరడంతో ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకే సమయంలో, ఒకే చోట చేయాలని మా కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు.పెళ్ళి దగ్గర పడుతుండడంతో కార్డులు పంచడం, షాపింగ్ వంటి పనులు కూడా పూర్తి చేసుకున్నాము. ఆ సమయంలో సల్మాన్ నాకు పెళ్ళి ఇష్టం లేదని, ఆసక్తి లేదంటూ క్యాన్సిల్ చేయించాడు. ఆ సమయంలోనే సల్మాన్ పెళ్ళి చేసుకొని ఉంటే ఈ సమయానికి అతడి పిల్లలు హీరోగా, లేదా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యేవారు. అప్పటినుండీ సల్మాన్ పెళ్ళి విషయమే ఆలోచిస్తున్నట్లుగా లేడు” అంటూ చెప్పుకొచ్చాడు.