Salman Khan: ఆ స్టార్‌ హీరో కూర్చోడం.. నిల్చోడం కష్టమైనా డ్యాన్స్‌ చేశాడట.. అదీ ఈ ఏజ్‌లో!

సినిమాల విషయంలో నటీనటులు చూపించే డెడికేషన్‌ గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. సినిమాల కోసం ఆరోగ్యాన్ని సైతం పక్కన పెట్టేసిన హీరోల గురించి, హీరోయిన్ల గురించి చదివే ఉంటారు. అలా చాలామంది పేర్లు వినిపిస్తాయి. ఒకరిద్దరి పేర్లు చెబితే మిగిలిన హీరోల ఫ్యాన్స్‌ హర్టవుతారు కాబట్టి.. ఆ విషయం వదిలేసి ఇప్పుడు ఆ పని చేసిన హీరో గురించి మాట్లాడుకుందాం. 59 ఏళ్ల వయసులో ఆయన ఈ పని చేయడం గమనార్హం.

Salman Khan

బాలీవుడ్‌లో ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్న మాటలు సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan).. సికందర్‌ (Sikandar). మురుగదాస్‌ (A.R. Murugadoss) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 30న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో సల్మాన్‌ ఖాన్‌ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం తాను పడ్డ శ్రమ గురించి మాట్లాడారు. ఇప్పుడు ఆ విషయాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులోనే తన గాయం గురించి కూడా తెలిసింది.

‘సికందర్‌’ సినిమా షూటింగ్‌ సమయంలో సల్మాన్‌ పక్కటెముకకు గాయమైందట. ఆ గాయంతోనే ఆయన చిత్రీకరణలో పాల్గొన్నారట. షూటింగ్‌ సమయంలో కూర్చోవడం, నిలబడడం కూడా కష్టంగా ఉండేదట. దగ్గడం, నవ్వడం కూడా చేయలేకపోయాడట. అయినా షూటింగ్‌లో పాల్గొన్నాడట. ఆ రోజు పాట షూట్‌ కచ్చితంగా చేయాల్సి రావడంతోనే అలా గాయంతోనే డ్యాన్స్ చేశాడట. అలా ఒక స్టెప్‌ వేసేటప్పుడు నొప్పితో పక్కటెముకలు పట్టుకున్నాడట.

అయితే కొరియోగ్రాఫర్‌ దాన్నే స్టెప్‌గా మార్చేశారట. డ్యాన్సర్లు ఆ స్టెప్‌నే చేశారని, స్క్రీన్‌లో ఆ పక్కటెముకల స్టెప్పు కనిపిస్తుంది అని చెప్పాడు సల్మాన్‌. ఇటీవల సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లోనూ మురుగదాస్‌ ఈ విషయం గురించి మాట్లాడారు. గాయం ఉన్నప్పటికీ ఆయన 14 గంటలు షూటింగ్‌లో పాల్గొన్నాడని చెప్పారు. సల్మాన్‌, మురుగదాస్‌కి కీలకంగా మారిన ఈ సినిమా ఎలాంటి ఫలితం సాధిస్తుందో చూడాలి. వీరికి ఉన్న హోప్స్‌లో రష్మిక మందన (Rashmika Mandanna) హిట్‌ ఫామ్‌ ఒకటి.

ఈ లైనప్ లో ఒక్కటి క్లిక్కయినా మహానటి రేంజ్ మారినట్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus