Tiger 3: తొలిసారి దీపావళికి రానున్న సల్మాన్ సినిమా

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద ట్రెండ్‌ సెట్‌ చేశాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఇదే జోనర్‌లో టైగర్‌ 3 రాబోతుంది. మనీశ్‌ శర్మ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. దీపావళి కానుకగా ఈ సినిమా నవంబర్ 12 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. అయితే సల్మాన్ ఖాన్ కరోనా తర్వాత ఆయన నాలుగు సినిమాలు చేస్తే, నాలుగు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇప్పుడు ఆశాలన్ని కూడా టైగర్ 3 మీద పెట్టుకున్నారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో రాలేదని విశ్వసనీయవర్గాల సమాచారం.

అయితే తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా పలు చిత్రాల్లో నటించి, ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై మోస్ట్ సక్సెస్‌ఫుల్ జోడీగా పేరుని సంపాదించుకున్నారు. అయితే వీరిద్దరూ కలిసి నటించిన సినిమా ఏదీ కూడా దీపావళి కి ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. తొలిసారి ఈ జోడీ నటించిన ‘టైగర్ 3’ దీపావళికి సందడి చేయనుంది. దీంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.

దీపావళి పండుగకి సినిమా టైగర్3 రిలీజ్ కావటం ఎంతో ప్రత్యేకమైనది. పండుపూట విడుదలయ్యే చిత్రాలను ప్రేక్షకులు ఆస్వాదించటానికి ఎక్కువగా ఇష్టపడతారు. అలా దీపావళి రోజున విడుదలైన నా చిత్రాలు తీపి గుర్తులుగా మిగిలిపోయాయి. అయితే నాకు, కత్రినాకు ఈ దీపావళి పండుగ మరెంతో ప్రత్యేకం. ఎందుకంటే ఇప్పటి వరకు మేం కలిసి నటించిన ఏ సినిమా కూడా దీపావళికి రిలీజ్ కాలేదు. తొలిసారి ‘టైగర్ 3’ (Tiger 3) రిలీజ్ కానుంది. కాబట్టి మేం ఎంతో ఆనందంతో, ఆసక్తికరంగానూ ఎదురు చూస్తున్నాం.

దీపావళి అంటే వ్యక్తులే కాదు, కుటుంబాలు కూడా ఒక చోటికి చేరుతాయి. నాకు కావాల్సిన వారితో దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకోవటానికి నేను ఇష్టపడతాను. అలాగే నా కుటుంబ సభ్యులందరితో కలిసి ‘టైగర్ 3’ సినిమాను చూస్తాను. అందరూ ఈ సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూసి అద్భుతమైన ఎక్స్‌పీరియెన్స్‌ని పొందుతారని భావిస్తున్నానని అన్నారు. మరి చూడాలి ఈ దీపావళి సల్మాన్ ఖాన్- కత్రినా కైఫ్ కు ఎలా కలిసి వస్తోందో..!

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus