Salman Khan, Chiranjeevi: ‘గాడ్ ఫాదర్’ లో సల్మాన్ పాత్ర పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

మెగాస్టార్ చిరంజీవి- మోహన్ రాజా కాంబినేషన్లో ‘గాడ్ ఫాదర్’ అనే మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన మోహన్ లాల్ ‘లూసిఫర్’ కు ఇది రీమేక్. ఆల్రెడీ ఇది తెలుగులో డబ్ అయ్యింది. అమెజాన్ ప్రైమ్లో తెలుగు వెర్షన్ అందుబాటులో ఉంది కూడా…. అయినప్పటికీ పలు మార్పులు చేసి భారీతనాన్ని జోడించి తెలుగు ప్రేక్షకులకు మళ్ళీ వడ్డించాలనేది చిరు ఆలోచన. తెలుగు నేటివిటీకి తగినట్టు స్క్రిప్ట్ ను కూడా రెడీ చేయించారు.

నయన తార ఓ పాత్రకి ఫిక్స్ అయ్యింది.. అది ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పాత్ర అని భోగట్టా.! టాలీవుడ్ హీరో సత్యదేవ్ కూడా ఓ పాత్రకి ఎంపికయ్యాడు. అయితే ‘లూసీఫర్’ క్లైమాక్స్ లో ఓ కీలక పాత్ర ఉంటుంది.ఆ చిత్రం దర్శకుడు పృథ్వి రాజ్ సుకుమారన్ ఆ పాత్రని పోషించాడు. తెలుగులో ఈ పాత్రని సల్మాన్ ఖాన్ పోషిస్తాడని సమాచారం.ఈ పాత్ర కోసం సల్మాన్ ఖాన్ 15 రోజులు డేట్స్ ఇచ్చాడట. ఇతని పాత్ర నిడివి కూడా 15 నిమిషాలు మాత్రమే ఉంటుందని వినికిడి.

ఇతని పాత్రకి తెలుగులో రాంచరణ్ డబ్బింగ్ చెబుతాడని తెలుస్తుంది. ఆల్రెడీ ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ చిత్రం తెలుగు వెర్షన్లో సల్మాన్ పాత్రకి డబ్బింగ్ చెప్పింది చరణే. ఇక మెగా ఫ్యామిలీకి సల్మాన్ ఖాన్ అత్యంత సన్నిహితుడు. పైగా తెలుగులో మార్కెట్ ఏర్పరుచుకోవాలని ఈ మధ్య తన ప్రతీ సినిమాని తెలుగులో డబ్ చేస్తూ వస్తున్నాడు. కాబట్టి ఈ వార్త నిజమే అని విశ్లేషకులు చెబుతున్నారు. చూడాలి వారి నమ్మకం ఎంత బలమైనదో..!

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus