బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చాలా రోజుల తరువాత బిగ్ స్క్రీన్ పై సందడి చేయబోతున్నట్లు సంబరపడే లోపే సెకండ్ వేవ్ వెంటనే దెబ్బ కొట్టేసింది. థియేటర్స్ మూత పడడంతో డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాను జీ ఫ్లెక్స్ లో పే పర్ వ్యూ ఫార్మాట్ లోనే రిలీజ్ చేశారు. ఒక వ్యూకి 249 రూపాయలు కేటాయించిన విషయం తెలిసిందే.
అయితే మొదటి నుంచి కూడా ఆ రేటుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక మొత్తానికి గురువారం మొదటి నిమిషం నుంచి సందడి చేయడం మొదలు పెట్టిన రాధే డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇలాంటి కమర్షియల్ సినిమాకు 249రూపాయలు ఖర్చు చేయడం అనవసరం అనే విమర్శలు వచ్చాయి. ఇక సినిమాకు పైరసీ వలన మరొక దెబ్బ పడింది. ఒక్క క్లిక్కుతో డౌన్ లోడ్ అయ్యేలా టెలిగ్రామ్ లో లింకులు దర్శనమిస్తున్నాయి.
గతంలో ఎప్పుడు లేని విదంగా ఒక బిగ్గెస్ట్ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలవ్వగా అదే తరహాలో పైరసీ మూవీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కేవలం రాధే అనే కాదు. ఈ రోజుల్లో ఓటీటీ సంస్థలకు టెలిగ్రామ్ యాప్ వల్ల భారీ ఆదాయానికి గండి పడుతోంది. ఓటీటీ ఎకౌంట్స్ దబ్బులిచ్చి తీసుకోవడం కన్నా సోషల్ మీడియాలో లింక్స్ ఇచ్చే పేజ్ లను , గ్రూపులను ఫాలో అయితే చాలు అని ఆలోచిస్తున్నారు. రాధే లాంటి సినిమాకే తప్పలేదు అంటే ఇక భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే.