Salman Khan: కెరీర్‌ తొలి రోజుల్ని గుర్తు చేసుకున్న సల్మాన్‌ ఖాన్‌!

జీవితంలో ఎంత ఎత్తుకి ఎదిగినా… మొదలుపెట్టిన స్థానం, రోజుల్ని మరచిపోకూడదు అంటుంటారు మన పెద్దలు. అలా గుర్తు పెట్టుకున్నవారిని ప్రజలు జీవితాంతం గుర్తుంచుకుంటారు అని చెబుతుంటారు. ఇలాంటి వారికి ఓ ఉదాహరణ బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌. వారసత్వంగా ఇండస్ట్రీలోకి వచ్చినా.. సగటు కొత్త హీరో పడాల్సిన అన్ని ఇబ్బందుల్ని సల్మాన్‌ ఫేస్‌ చేశాడు. తొలినాళ్లలో మంచి డ్రెస్‌ కూడా కొనుక్కునే డబ్బులు ఉండేవి కావట. తొలి సినిమా హిట్‌ అయినా మంచి అవకాశాలు రాలేదు. వాటి గురించే మాట్లాడాడు సల్మాన్‌.

నటుడి కెరీర్‌ ప్రారంభించిన తలి రోజుల్లో బాలీవుడ్‌కు చెందిన చాలామంది తనకెంతో సాయం చేశారని సల్మాన్‌ గుర్తు చేసుకున్నారు. జూన్‌ 3, 4 తేదీల్లో దుబాయ్‌లో జరిగిన ‘ఐఫా’ అవార్డుల ప్రదానోత్సవానికి సల్మాన్‌ ఖాన్‌ వ్యాఖ్యతగా వ్యవహరించాడు. ఈ క్రమంలో ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకున్న సల్లూ భాయ్‌… కాస్త భావోద్వేగానికి లోనయ్యాడు. బోనీకపూర్‌ తన జీవితానికెంతో సాయం చేశారన్న సల్మాన్‌… వరుస పరాజయాలతో కెరీర్‌లో గడ్డుకాలం ఎదుర్కొంటున్న రోజుల్లో ‘వాంటెడ్‌’ ప్రాజెక్ట్‌ ఆఫర్‌ చేశారని గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత ‘నో ఎంట్రీ’లో అవకాశం ఇచ్చారని చెప్పాడు.

ఇక సునీల్‌ శెట్టి తనకు అన్నయ్య లాంటివాడని, ఆయనంటే ఎంతో అభిమానమని చెప్పాడు. సినిమాల్లోకి అడుగుపెడుతున్న తొలి రోజుల్లో ఓసారి వారిద్దరూ దుస్తులు కొనేందుకు షాప్‌కి వెళ్లారట. ట్రెండీ జీన్స్‌, షర్ట్‌, బూట్లు, పర్స్ ఉన్న ఓ సెట్‌ సల్మాన్‌కు ఎంతో నచ్చిందట. కొందామంటే అంత డబ్బులు లేవట. దాంతో బాధగా వచ్చేశాడట. ఈ విషయం గుర్తించిన సునీల్‌ శెట్టి.. ఆ సెట్‌ కొనుగోలు చేసి సల్మాన్‌కు బహుమతిగా అందించారట సునీల్‌ శెట్టి.

బాలీవుడ్‌లో తను దేవుడిగా భావించే వ్యక్తి రమేశ్‌ తౌరానీ గురించి కూడా సల్మాన్‌ మాట్లాడాడు. రమేశ్‌ తౌరానీ లేకుంటే తన కెరీర్‌ ఇలా ఉండేది కాదని చెప్పాడు. ‘మైనే ప్యార్‌ కియా’ తర్వాత ఆరు నెలల పాటు ఎలాంటి ఆఫర్‌ రాలేదు. దాంతో సల్మాన్‌ నాన్న ప్రముఖ నిర్మాత జీపీ సిప్పీతో నేను సినిమా చేస్తున్నట్లు రూ.2000 చెల్లించి ఓ ఫిల్మ్‌ మ్యాగజైన్‌లో ఫేక్‌ ప్రకటన వచ్చేలా చేశారట. అది చూసిన నిర్మాత రమేశ్‌… సిప్పీ కార్యాలయానికి వెళ్లి రూ.5 లక్షలిచ్చి తానూ ఆ సినిమా నిర్మాణంలో భాగమవుతానని కోరారు. ఆయన చేసిన పనితో నాకు ‘పత్తర్‌ కే ఫూల్‌‌’ ప్రాజెక్ట్‌ వరించిందని చెబుతూ సల్మాన్‌ చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus