కొత్త సినిమా అంటే థియేటరే అనుకుంటున్న సమయంలో గతేడాది కరోనా వచ్చి… ‘ఓటీటీ’ని పోటీలో నిలిపింది. కొత్త సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి. దీంతో ఇదేదే లాభసాటి బేరంలా ఉందే అనుకొని చాలా సినిమాలు అలా ఓటీటీలో వచ్చి విజయం సాధించాయి. కొన్నయితే ఇబ్బందులుపడ్డాయి. దానికి ఇంకాస్త అడ్వాన్డ్ వెర్షన్‌ను ఇప్పుడు బాలీవుడ్‌లో ట్రై చేయబోతున్నారు. అక్కడ గనక ఇది హిట్ అయితే టాలీవుడ్‌లోనూ తీసుకొస్తారేమో చూడాలి.
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘రాధే’. నిజానికి ఈ సినిమా గతేడాది మే 22న విడుదల కావాలి. అయితే కరోనా పరిస్థితుల కారణంగా సినిమా పూర్తవక విడుదల చేయలేకపోయారు. అయితే తిరిగి చిత్రీకరణ మొదలవడంతో అక్టోబరు 2020లో చిత్రీకరణ పూర్తి చేశారు. దాంతోపాటు సల్మాన్ బాగా కలిసొచ్చే రంజాన్‌కు విడుదల చేయాలని నిర్ణయించారు. దీంతో అభిమానులు ఈ రంజాన్.. భలే భలే అనుకున్నారు. కానీ మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో విడుదల చేయలేని పరిస్థితి వచ్చింది.
అయితే ముందుగా అభిమానులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అంటూ సల్మాన్ ఖాన్ తన సినిమా విడుదల తేదీని మరోసారి ప్రకటించాడు. మే 13న సినిమాను విడుదల చేస్తున్నాం అని తెలిపాడు. అయితే సినిమా వచ్చేది థియేటర్లలో కాదు ఓటీటీలో. అంత పెద్ద సినిమా ఓటీటీలోనా అని ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే సినిమాను పేపర్ వ్యూ పాలసీలో తీసుకొస్తున్నారు. అంటే మీకు ఓటీటీ ప్యాకేజీని సబ్‌స్క్రైబ్ చేసి ఉన్నా, మళ్లీ డబ్బులు చెల్లించి సినిమా చూడాల్సి ఉంటుంది. డబ్బులు ఎంత అనేది త్వరలో చెబుతారు. ఈ సినిమాను జీప్లెక్స్. జీ5 ఓటీటీలో విడుదల చేస్తున్నారు.
ఇదంతా బాలీవుడ్ గురించి. మరి టాలీవుడ్ సంగతేంటి. అక్కడ సల్మాన్ సినిమా అని, డబ్బులు బాగా ఖర్చు పెట్టుంటారని… ఇలా రకరకాల కారణాలతో సినిమాను ఓటీటీలో తెచ్చి, త్వరగా డబ్బులు సంపాదించాలని చూస్తున్నారు. తెలుగులో కూడా ఇలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. మరి మన హీరోలు, దర్శకనిర్మాతలు ఇలాంటి ఆలోచన చేమైనా చేస్తారా? అనేదే ప్రశ్న. మామూలుగా అయితే చేయకపోవచ్చు. కానీ మళ్లీ సినిమా థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయి, జనాలు వస్తారా అనే విషయం సరైన సమాధానం దొరకడం లేని పరిస్థితుల్లో ‘రాధే’ రెస్పాన్స్ చూపి మనవాళ్లు కూడా ఇదే ప్లాన్ చేస్తారని టాక్ వినిపిస్తోంది.
Most Recommended Video
‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!