మొన్నామధ్య సల్మాన్ చేసిన “రేప్” కామెంట్ పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం బాలీవుడ్ ఖాన్ లలో సీనియరైన షారుక్ ఖాన్ “నో కామెంట్స్” అంటూ తప్పించుకోగా.. తాజాగా అమీర్ ఖాన్ మాత్రం “సల్మాన్ కామెంట్ హేయమైనది” అని సల్మాన్ పై విరుచుకుపడ్డాడు.
మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ డైరెక్ట్ గా సల్మాన్ పై ఈ విధంగా స్టేట్ మెంట్ ఇవ్వడంతో బాలీవుడ్ మీడియా కూడా ఆశ్చర్యపోయింది. అత్యంత సన్నిహితంగా మెలిగే ఈ ఖాన్ కథానాయకుల మధ్య ఈ వివాదం ఏదైనా డిఫరెన్స్ తీసుకోవస్తుందేమో చూడాలి!