శ్రీవిష్ణు సినిమా అంటే జనాల్లో ఓ పాజిటివ్ అభిప్రాయం ఉంటుంది. అతని సినిమాలు భారీ బ్లాక్ బస్టర్లు అయిన సందర్భాలు లేకపోయినా… అతను సెలెక్ట్ చేసుకునే కథలు బాగుంటాయి. అందుకే ‘రాజ రాజ చోర’ తర్వాత ‘అర్జున ఫల్గుణ’ ‘భళా తందనాన’ ‘అల్లూరి’ వంటి ప్లాప్ లు పడినా.. అతను హీరోగా ‘సామజవరగమన’ వంటి మరో సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూశారు. ‘వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకుడు.
జూన్ 29న రిలీజ్ అయిన ఈ చిత్రానికి మొదటి షోతోనే పాజిటివ్ టాక్ లభించింది. దీంతో మొదటి రోజు ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
0.35 cr
సీడెడ్
0.07 cr
ఉత్తరాంధ్ర
0.09 cr
ఈస్ట్
0.06 cr
వెస్ట్
0.04 cr
గుంటూరు
0.06 cr
కృష్ణా
0.05 cr
నెల్లూరు
0.04 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
0.76 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.18 cr
ఓవర్సీస్
0.15 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
1.09 cr (షేర్)
‘సామజవరగమన’ (Samajavaragamana) చిత్రానికి రూ.3.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.2 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ చిత్రం రూ.1.09 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.3.11 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.