Samajavaragamana: శర్వానంద్ సినిమా నష్టాలు శ్రీవిష్ణు సినిమా తీరుస్తుందట!

‘ఆర్.ఎక్స్.100’ తర్వాత దర్శకుడు అజయ్ భూపతి చేసిన సినిమా ‘మహాసముద్రం’. శర్వానంద్ , సిద్దార్థ్ లు హీరోలుగా నటించిన ఈ సినిమా 2021 అక్టోబర్ 14న రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ చిత్రం పెద్ద డిజాస్టర్ అయ్యింది. థియేట్రికల్ రైట్స్ పరంగా చూసుకుంటే కనీసం 50 శాతం కూడా ఈ మూవీ రికవరీ చేయలేకపోయింది. ఈ సినిమా ఇంత పెద్ద డిజాస్టర్ అవ్వడానికి కారణం ఏంటి.. అనేదానిపై ఆల్రెడీ సిద్దార్థ్ స్పందించాడు.

‘స్నేహితుడి ప్రియురాలిని హీరో పెళ్లి చేసుకోవడం..అలాగే స్నేహితుడి కూతుర్ని తన సొంత కూతురిగా చూసుకోవడం అనే దానిని జనాలు యాక్సెప్ట్ చేయలేదు’ అంటూ సిద్దార్థ్ ‘టక్కర్’ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు.తాజాగా ఈ ‘మహాసముద్రం’ ఫలితం గురించి నిర్మాత అనిల్ రావిపూడి కూడా స్పందించారు. అసలు ‘మహాసముద్రం’ అనేది తన నిర్మాణంలో తీయాల్సిన సినిమా కాదని.. కానీ కాంబినేషన్ ను నమ్మి తీసిన (Samajavaragamana) సినిమా ఇదని అనిల్ సుంకర చెప్పుకొచ్చారు.

‘ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి దర్శకుడే అని చెప్పడం సరికాదని ..తాను ఏదైతే చెప్పాడో అదే తీసాడని.. ‘ అనిల్ సుంకర అన్నారు. ‘సామజవరగమన’ సక్సెస్ తో కొంత ఊపిరి పీల్చుకున్నాను. ఈ సినిమా మాకు టేబుల్ ప్రాఫిట్. దీని ద్వారా వచ్చే కలెక్షన్స్ తో ‘మహాసముద్రం’ నష్టాలు తీరుస్తాము. ‘ఏజెంట్’ నష్టాల గురించి చర్చలు జరిగాయి. ‘భోళా శంకర్’ కి కూడా ‘మహాసముద్రం’ ‘ఏజెంట్’ డిస్ట్రిబ్యూటర్సే.. ఇన్వాల్వ్ అవుతారు’ అంటూ అనిల్ సుంకర చెప్పుకొచ్చాడు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus