సినిమాలకి సమంత గుడ్ బై… వైరల్ అవుతున్న సమంత కామెంట్స్..!

ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ళు పూర్తయినా… అదే స్టార్ డం ను మైంటైన్ చేస్తుంది మన అక్కినేని వారి ఇంటికోడలు సమంత. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ రోల్స్ చేసినా.. పెద్ద పెద్ద స్టార్ హీరోలతో కలిసి నటించినా.. నాగ చైతన్యతో పెళ్ళైన తర్వాత కేవలం కథా ప్రాధాన్యత ఉండే పాత్రలని మరియు అలాంటి సినిమాలనే ఎంచుకుంటూ వస్తుంది సమంత. అయితే ఈమె క్రేజ్ ముందు కంటే ఇప్పుడు డబుల్ అయ్యిందనే చెప్పాలి. అంతేకాదు లేడీ సూపర్ స్టార్ రేంజ్లో దూసుకుపోతుంది. అయితే కేవలం ఇలాంటి పాత్రలే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు అని సమంతానే అడిగితే ఆసక్తికరమైన సమాధానాన్ని చెప్పింది.

‘జాను’ సినిమా ప్రమోషన్లలో భాగంగా సమంత మాట్లాడుతూ.. ” హీరోయిన్లకు స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. నా అదృష్టం పదేళ్ళ వరకూ అదే స్థాయి మైంటైన్ చేస్తున్నాను. ముందు నుండీ ఇలాంటి సినిమాలే చెయ్యాలి అని కూర్చోలేదు. నాకు నచ్చిన పాత్రల్ని చేసుకుంటూ వచ్చాను. ‘రంగస్థలం’ చిత్రం కథ ఏంటి అన్నది.. సినిమా పూర్తయ్యే వరకూ తెలీదు. ఆ పాత్ర నచ్చింది చేశాను. దానికి మంచి గుర్తింపు వచ్చింది. ‘ఓ బేబీ’ ‘జాను’ కూడా అలాగే చేశాను. మహా అయితే మరో రెండేళ్లు ఇండస్ట్రీలో ఉంటానేమో. అందుకే నేను రిటైర్ అయ్యాక కూడా నా గురించి ప్రేక్షకులు మాట్లాడుకోవాలి. అందుకే ప్రతీ సినిమా నా మొదటి సినిమా అని ఫీలయ్యి కొత్త పాత్రలు చేస్తున్నాను. అలా అని నేను సినిమాలను వదిలేస్తున్నాను అనడం లేదు. నాకు కుటుంబం ఉంది. దాని గురించి ఆలోచించాలి కదా” అంటూ చెప్పుకొచ్చింది.

Most Recommended Video

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus