ఎంకరేజ్ చేసే కుటుంబం ఉండగా ఇబ్బంది ఎందుకు

“సమంత సినిమాలు మానేస్తుందట” గత రెండుమూడు రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వార్త ఇది. అసలు సమంతకి సినిమాలు మానేయాల్సిన అవసరం ఏమోచ్చింది? వరుస విజయాలు, సూపర్ స్టార్ డమ్, స్టార్ హీరోలతో సినిమాలు ఇన్ని ఉండగా ఉన్నట్లుండి సమంత సినిమాలు ఎందుకు మానేయాలి అనుకొంటోంది అనేది ఎవరికీ అర్ధం కాలేదు. దాంతో.. కాస్త కన్ఫ్యూజన్ నెలకొంది. సాధారణంగా ఈ తరహా వార్తలొచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యే సమంత కూడా సైలెంట్ గా ఉండిపోవడంతో అందరూ నిజమే అనుకొన్నారు.

అయితే.. ఇవాళ ఉదయం సమంత క్లోజ్ ఫ్రెండ్స్ కొందరు రెస్పాండ్ అయ్యారు. తన ఎక్స్ టెండెడ్ ఫ్యామిలీ అయిన అక్కినేని కుటుంబం తనను బాగా సపోర్ట్ చేస్తూ.. ఇంకా ఎంకరేజ్ చేస్తోంది. ప్రస్తుతం ఆమె నాగచైతన్యతో కలిసి ఒక సినిమా చేస్తోంది, దాంతోపాటు “యూ టర్న్” రీమేక్ లో నటిస్తోంది. ఈ సినిమా కాకుండా మరో రెండు సినిమాలు ప్లానింగ్ లో ఉన్నాయి. కాకపోతే.. ఇంతకుముందులా వరుస సినిమాలు కాకుండా ప్లానింగ్ ప్రకారం సినిమాలు చేస్తోంది. కమర్షియల్ సినిమాలు కాకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేయాలనుకొంటోంది. అందుకే కాస్త నెమ్మదించింది అని క్లారిటీ ఇచ్చారు సమంత స్నేహితులు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus