మరో ఛాలెంజింగ్ రోల్ లో అక్కినేని కోడలు!

దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించనున్న భారీ బడ్జెట్ సినిమా ‘శాకుంతలం’లో టైటిల్ రోల్ పోషించేదెవరనే విషయంలో చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. సమంత, అనుష్క, పూజా హెగ్డేల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఈ క్రమంలో తాజాగా ‘శాకుంతలం.. కావ్యనాయకి’ అంటూ హీరోయిన్ పేరుని అధికారికంగా ప్రకటించారు దర్శకుడు గుణశేఖర్. ఈ సినిమాలో శకుంతలగా సమంత కనిపించనున్నట్లు వెల్లడించారు. విభిన్నమైన పౌరాణిక ప్రణయ గాథగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని పేర్కొన్నారు.

మొదటిసారి సమంత పౌరాణిక పాత్రలో అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ వార్త విన్న సామ్ అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. మరో డిఫరెంట్ రోల్ లో తన అభిమాన నటించి చూడొచ్చు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. నిజానికి ఒకరకంగా చెప్పాలంటే తన కెరీర్ లో ఇదొక ఛాలెంజింగ్ రోల్ అని చెప్పొచ్చు. ఈ సినిమాను జనవరిలో మొదలుపెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని గుణశేఖర్ ప్లాన్ చేస్తున్నాడు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించనున్నారు.

త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు. ప్రస్తుతం సమంత కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా భర్త నాగ చైతన్య, స్నేహితులతో కలిసి గోవాకి వెళ్లింది.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus