Samantha,Mrunal: సమంత – మృణాల్‌ కలసి వస్తున్నారా? ట్వీట్ల అర్థం ఇదేగా!

పాన్‌ ఇండియా సినిమాలు, ఊహించని మల్టీస్టారర్‌లు ఇప్పుడు ఇండియన్‌ సినిమాలో ఇలాంటివే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎవరూ ఊహించని కాంబినేషన్‌లో సినిమాలు అఫీషియల్‌ అండ్‌ అన్‌ అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్లుగా వస్తున్నాయి. మొన్నటికి మొన్న హృతిక్‌ రోషన్‌ – తారక్‌ సినిమా అన్‌ అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చేసింది. త్వరలో ఈ సినిమా అఫీషియల్‌గా ప్రకటిస్తారు అని చెబుతున్నారు. ఈ సమయంలో మరో మల్టీస్టారర్‌ విషయంలో పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే తాజా పుకార్లకు కారణం.. ఎవరో సన్నిహితులు కాదు.

ఆ సినిమాలో నటిస్తారు అంటున్న వాళ్లే. ఓ హీరోయిన్‌ రాబోయే సినిమా కోసం మరో హీరోయిన్‌ శుభాకాంక్షలు చెబుతూ ట్విటర్‌లో ఓ ట్వీట్ చేసింది. దాంతోపాటు తన మనసులో మాటను కూడా అడిగేసింది. దానికి ఆ హీరోయిన్‌ చెప్పిన సమాధానంతోనే ఇప్పుడు మల్టీస్టారర్‌ సినిమా గురించి పుకార్లు రావడం మొదలయ్యాయి. ఆ హీరోయిన్లు ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. వాళ్లే సమంత, మృణాల్‌ ఠాకూర్‌. సౌత్ ఇండియా సినిమాల్లో మంచి క్రేజ్ ఉన్న స్టార్‌ హీరోయిన్‌ సమంత, ‘సీతా రామం’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మృణాల్‌ ఠాకూర్‌ మధ్య ఈ చర్చ నడిచింది.

సమంత (Samantha) ఇప్పుడు తన పాన్ ఇండియా సినిమా ‘శాకుంతలం’ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ శుక్రవారం సినిమా వస్తోంది. ఈ నేపథ్యంలో మృణాల్‌ ఠాకూర్‌ ట్వీట్‌లో సమంతకు విషెష్‌ చెప్పింది. దాంతోపాటు మనం ఇద్దరం కలసి ఎప్పుడు నటిస్తాం అని అడిగేసింది. ఆ ట్వీట్‌కి సమంత తర్వాత రిప్లై ఇచ్చింది. అందులో ఆమె ‘కంగ్రాట్యులేషన్స్‌ ‘గుమ్రా’ నాయిక’ అని రాసుకొచ్చింది. దాంతోపాటు నువ్వు చెప్పిన ఐడియా బాగుంది..

కచ్చితంగా చేద్దాం అని ట్వీట్‌ చేసింది. దీంతో ఇద్దరూ కలసి ఓ సినిమా చేయాలనుకుంటున్నారు, చేస్తున్నారా? చేస్తున్నారు, చేసే అవకాశం ఉంది అంటూ పుకార్లు మొదలయ్యాయి. కాస్త కూడా క్లారిటీ లేకుండా ఇద్దరూ ఇలా ట్వీట్లు చేయరు.. అంటే ఎవరో భారీగా ప్లాన్‌ చేసి మల్టీస్టారర్‌ సిద్ధం చేస్తున్నారు అని అనుకుంటున్నారు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus