Samantha: కల మొదలైంది అంటూ అలాంటి ఫోటోలను షేర్ చేసిన సమంత.. ఫోటోలు వైరల్!

సమంత ప్రస్తుతం సినిమాలకు ఏడాది పాటు విరామం ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఇలా సినిమాలకు దూరమైనటువంటి సమంత ప్రస్తుతం పలు వెకేషన్ లకు వెళుతూ తన ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. అయితే ఈమె ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళుతున్నారని వార్తలు వచ్చాయి కానీ సమంత మాత్రం పలు ఆధ్యాత్మిక పర్యటనలు చేయడమే కాకుండా తన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే గత రెండు రోజుల క్రితం ఈమె కోయంబత్తూర్ ఈషా సద్గురు ఫౌండేషన్ లో సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.

అయితే తాజాగా ఇండోనేషియా బాలీ అందాలను వీక్షిస్తూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే బాలి వెకేషన్ లో ఉన్నటువంటి సమంత అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైట్ కలర్ డ్రెస్ ధరించి హ్యాట్ తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇక ఈ హ్యాట్ పై డ్రీమ్స్ ఆన్ అని రాసి ఉంది.

అలాగే మరో ఫోటోలో సమంత యోగ ముద్రని చూపిస్తూ కనిపించింది.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలను కనుక చూస్తుంటే సమంత ట్రీట్మెంట్ కోసం అమెరికా బహుశా వెళ్లకపోవచ్చు అని ఈమె ప్రకృతి పద్దతిలో మెడిటేటివ్ ట్రీట్‌మెంట్ తీసుకోబోతున్నారని తెలుస్తుంది. ఏదిఏమైనా సమంత తన ఆరోగ్యం కోసం ఏడాది పాటు సినిమాలకు విరామం ప్రకటించి ఇలా ప్రకృతి అందాలను వీక్షిస్తూ తన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది.

ఇక సమంత (Samantha) సినిమాల విషయానికి వస్తే ఈమె విజయ్ దేవరకొండ సరసన నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. అలాగే ఈమె సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ రెండు షూటింగ్ పూర్తి చేసుకుని ఈమె బ్రేక్ ఇచ్చారు.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus