Samantha: హద్దులు దాటిన అభిమానం.. ఏకంగా గుడి కట్టేశారుగా?

సాధారణంగా సినీ తారలు అంటే పెద్ద ఎత్తున వారికి అభిమానులు ఉంటారు.ఇలా వారు నటించిన సినిమాలు విడుదలవుతున్నాయి అంటే అభిమానులు తమ స్టైల్ లో వారి అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు. అలాగే వారి పుట్టినరోజు వంటి ప్రత్యేకమైన రోజులలో కూడా అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు. అయితే అభిమానం హద్దులు దాటితే ఇలాగే ఉంటుందని తాజాగా ఓ అభిమాని నిరూపించారు. గతంలో హీరోయిన్ల కొత్త మా అభిమానులు గుడి కట్టిన సందర్భాలు తమిళనాడులో చోటు చేసుకున్నాయి.

తమిళనాడులో కుష్బూ నిధి అగర్వాల్ వంటి హీరోయిన్లకు అక్కడ అభిమానులు గుడి కట్టారు. అయితే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సమంతకు కూడా ఓ అభిమాని గుడి కట్టడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సమంత అంటే అభిమానం ఉన్నటువంటి ఈయన ఏకంగా ఆమెకు గుడి కట్టేశారు. బాపట్ల జిల్లా ఆలపాడుకు చెందిన సందీప్ అనే వ్యక్తి సమంతకు వీరాభిమాని.

ఈయన సమంత (Samantha) మయోసైటిసిస్ వ్యాధితో బాధపడుతున్న సమయంలో తాను ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలని దేవుడిని మొక్కుకొని ఏకంగా పాదయాత్ర కూడా చేశారు.ఇలా సమంతపై ఈయనకు ఉన్నటువంటి అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నారు. అయితే తాజాగా సమంత పట్ల తనకు ఉన్నటువంటి అభిమానం మరో అడుగు ముందుకు వేసేలా చేసింది. సమంత అంటే ఎంతో ఇష్టం ఉన్నటువంటి సందీప్ ఏకంగా ఆమెకు గుడి కట్టించారు.

సందీప్ తన ఇంట్లోనే సమంత కోసం ప్రత్యేకంగా ఓ గుడి ఏర్పాటు చేశారు. ఇక ఈ గుడిని సమంత పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలియజేశారు.ఏప్రిల్ 28వ తేదీ సమంత పుట్టినరోజు కావడంతో అదే రోజున సమంత కోసం నిర్మించిన గుడిని కూడా ప్రారంభిస్తానని సందీప్ వెల్లడించారు.ఇలా సందీప్ సమంత కోసం గుడి కట్టడంతో ఇది తెలిసినటువంటి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus