టాలీవుడ్‌లోనే కాదు ఏ వుడ్‌లో అయినా ఒక హీరో గురించి అభిమానులు, హీరోను అభిమానించే ఇతర నటీనటులు ఆ హీరో గురించి తెగ మెచ్చేసుకుంటూ ఉంటే ఇతర అభిమానులు తట్టుకోలేరు. ఆ వ్యక్తులు చెప్పేదాంట్లో నిజం ఉన్నా.. తట్టుకోలేరు. దీని వల్లనే ఫ్యాన్ వార్‌లు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇప్పుడు మరీ ఇంత ఫ్యాన్ వార్ జరిగేంత పరిస్థితి లేకపోయినా.. ఓ హీరోయిన్‌ని ఆకాశానికెత్తుతున్న పరిస్థితులు టాలీవుడ్‌లో కనిపిస్తున్నాయి..
తెలుగులోనే కాదు.. ఇండియన్ సినిమాలో ఇలాంటి పరిస్థితి చూడం. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేసి, సూపర్ స్టార్ అనిపించుకున్న హీరోయిన్లకు కూడా లేనంతగా ఎలివేషన్లు ఓ హీరోయిన్‌కి గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో దక్కుతున్నాయి. ఈ టాపిక్ రెయిజ్ చేస్తున్నాం అని ఆమె మీద వ్యతిరేకత ఉందని కాదు. కానీ గతాన్ని మరిపించేలా, గతంలో జరిగిన విషయాల్లో తన తప్పు ఏ మాత్రం లేదు అనేలా ఓ కథను చుట్టూ అల్లుతున్నారు.
ఇప్పుడు ఏకంగా ఆమెను దేవతతో పోల్చి ఆకాశానికెత్తుతున్నారు. హీరోలను ఇలా దేవుడుతో ఎవరైనా పోల్చినప్పుడు నానా యాగీ చేసే కొంతమంది ఇప్పుడు ఆమెను దేవతతో పోలిస్తే మాత్రం రియాక్ట్ అవ్వడం లేదు. ఇటీవల జరిగిన ఆ సినిమా వేడుకలో ఆమె సినిమా టీమ్‌లోని వ్యక్తి, డిస్ట్రిబ్యూటర్ ఈ ‘దేవత’ కామెంట్లు చేశారు. ఇలాంటి మాటలు సినిమాల ఫంక్షన్లలో హీరోల గురించి మాత్రమే ఇన్నాళ్లూ విన్నాం.
ఈ ఈవెంట్‌కి ముందు ఓ ప్రెస్ మీట్‌లో ‘భర్త అంటే ఎలా ఉండాలి’ అని చెప్పే క్రమంలో గతంలో జరిగిన ఓ విషయంలో తనదేం తప్పు లేదు అని చెప్పకే చెప్పింది ఆ హీరోయిన్. గతాన్ని తవ్వుకోవడం మానేసిన ఆ హీరో ఎప్పుడూ ఈ టాపిక్ మాట్లాడరు. ఈ హీరోయిన్ మాత్రం కత్తులు, నమ్మకాలు అంటూ పాస్ట్‌ను తవ్వుతూనే ఉన్నారు. కొత్త జీవితం ప్రారంభించిన ఆ ‘దేవత’ ఆమె పని ఆమె చూసుకుంటే ఎవరి జీవితాలు వారివిలా ఉంటారు కదా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.