Samantha: యూట్యూబ్ ఛానెల్స్ పై కేసు వేసిన సమంత!

ప్రస్తుత కాలంలో సెలబ్రిటీల పై మీడియా చానల్స్ లో వచ్చే వార్తల కంటే కూడా యూట్యూబ్ చానల్స్ లో వచ్చే అనేక రకాల కథనాలు కాస్త ఇబ్బందులను కలుగజేస్తున్నాయి. సెలబ్రిటీలు ప్రతిసారి కూడా యూట్యూబ్ ఛానల్స్ కథనాలపై సీరియస్ అవుతున్నప్పటికీ కూడా ఈ విషయంలో ఎవరూ కూడా మారకపోవడం విశేషం. ఇక సెలబ్రెటీలు తప్పుడు వార్తలను ప్రచారం చేసిన వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నారు.ఇక సమంత కూడా తన పరువు నష్టం కలిగించారని కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పై పరువు నష్టం దావా కేసు వేయడంతో తో ఒక్కసారిగా న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల కాలంలో సమంత తన వ్యక్తిగత మ్యారేజ్ విషయంలో లో కొంత ప్రైవసీ కావాలనే ముందే చాలా వివరంగా తెలియజేసింది. అయితే కొన్ని యూట్యూబ్ చానల్స్ మాత్రం ఎప్పటి తరహాలోనే అబద్దాలను ప్రచారం చేసిందని కూకట్ పల్లి కోర్టులో కేసు వేశారు. సోషల్ మీడియాలో తన పరువుకు నష్టం కలిగించారని ఆమె మూడు యూట్యూబ్ ఛానల్స్ పై కూకట్ పల్లి కోర్టులో నటి పరువు నష్టం దావా కేసు వేశారు.

అందులో ‘సుమన్’ టివి, ‘తెలుగు పాపులర్’ టీవీ , ‘టాప్ తెలుగు’ టీవీ తో పాటు వెంకట్రావు అనే అడ్వకేట్ పై కూడా సమంత కేసు దాఖలు చేశారు. ఇదే తరహాలో మరికొందరు సెలబ్రిటీలులు కొన్ని మీడియా ఛానల్స్ పై కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus