తన మేనేజర్ పై కోపాన్ని ప్రదర్శించిన సమంత!

రాహుల్ రవీంద్రన్ నటుడిగానే కాదు దర్శకుడిగా నిరూపించుకున్నారు. అతను మేకప్ ని పక్కన పెట్టి.. మెగా ఫోన్ ని పట్టుకొని చేసిన తొలి మూవీ “చిలసౌ”. అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్, రుహాని శర్మ జంటగా నటించిన ఈ మూవీ ఆగస్ట్‌ 3న రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది అన్నపూర్ణ స్టూడియోస్‌, సిరునీ సినీ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున, భరత్‌ కుమార్‌, జస్వంత్‌ నడిపల్లి  సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ మంచి కలక్షన్స్ రాబడుతోంది.  ఈ సినిమా ప్రమోషన్లో అక్కినేని హీరోలు బాగా యాక్టివ్ గా ఉన్నారు. అందులో భాగంగానే ఈ చిత్రాన్ని ముందుగానే సమంత, నాగచైతన్య తదితరులు చూశారు. ఆ తర్వాత తన అభిప్రాయాన్ని మీడియా ముందు వ్యక్తం చేశారు.  “రాహుల్‌ యాక్టర్‌గా నాకు కనెక్ట్‌ కాలేదు కానీ.. డైరెక్టర్‌గా కనెక్ట్‌ అయ్యాడు.” అని రాహుల్ పై సమంత ప్రసంశలు గుప్పించిన సంగతి తెలిసిందే.

తాజాగా సమంత ఈ సినిమాపై వెరైటీగా ట్వీట్ చేశారు. “చిలసౌ”, “గూఢచారి” చిత్రాలు హిట్  కావడంతో ఈ రెండు సినిమాల్లో నటించిన వెన్నెల కిశోర్, మహేంద్ర(సమంత మేనేజర్), రాహుల్ లు పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలను మహేంద్ర తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నాడు. ఈ చిత్రాల సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నానని, అడవి శేషు, రాహుల్ రవీంద్రన్ కోసం వెయిట్ చేస్తున్నానని మహేంద్ర ట్వీట్ చేయగా, సమంత వాటిని చూసింది. “ఈ ట్వీట్‌ ను ఎవరు టైప్‌ చేశారు.. ముందు అది చెప్పు” అని సమంత వెంటనే స్పందించింది. ఈ పార్టీకి తనను ఎందుకు పిలవలేదన్న కోపాన్ని సమంత ఈ ట్వీట్ ద్వారా తెలిపారు. వీరి మధ్య ట్వీట్ సంభాషణ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus