మరో ప్రయోగాత్మక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత..!

తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటికీ స్టార్ హీరోయిన్లుగా రాణిస్తున్నారు అనుష్క, సమంత.ఇప్పటికే అనుష్క లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఆ ఇమేజ్ కు కొద్ది దూరంలో సమంత కూడా ఉంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఓ విషయంలో సమంత.. అనుష్కనే ఫాలో అవుతుందట. విషయం ఏమిటంటే.. సమంత ఓ ప్రయోగాత్మక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈమధ్య కాలంలో సమంత గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉంటూ.. తనకు మంచి పేరు తెచ్చిపెట్టే పాత్రల్నే ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే.

‘రంగస్థలం’ ‘యూ టర్న్’ ‘ఓ బేబీ’ ‘సూపర్ డీలక్స్’ వంటి చిత్రాలు ఆ కోవకి చెందినవే..! ‘ఫ్యామిలీ మెన్2’ వెబ్ సిరీస్ లో టెర్రరిస్ట్ గా కంప్లీట్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తుంది సమంత. ఇప్పుడు అంతకు మించిన రిస్కీ రోల్ ఒకటి చెయ్యడానికి సమంత రెడీ అయ్యిందట. వివరాల్లోకి వెళితే.. తాప్సితో ‘గేమ్ ఓవ‌ర్‌’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని తీసి హిట్ అందుకున్న అశ్విన్ శ‌ర‌వ‌ణ‌న్ డైరెక్షన్లో ఓ చిత్రం చెయ్యడానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ చిత్రంలో స‌మంత మూగ అమ్మాయిగా క‌నిపించబోతుందట‌.

ఇది కంప్లీట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ అని సమాచారం.’ సోనీ పిక్చ‌ర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నట్టు తెలుస్తుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ చిత్రాన్ని ఏకకాలంలో విడుదల చేస్తారట. త్వరలో ఓటిటిలో విడుదల కాబోతున్న ‘నిశ్శబ్దం’ చిత్రంలో అనుష్క మూగ అమ్మాయిగా నటించిన సంగతి తెలిసిందే.ఇప్పుడు సమంత కూడా అలాంటి ఛాలెంజింగ్ పాత్రనే ఎంచుకున్నట్టు స్పష్టమవుతుంది.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus